• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రాజ్యసభ రేసులో భారీ ట్విస్టు : ఆ నేతక్కు దక్కితే అనూహ్యమే : సీఎం జగన్ ఎంపిక వెనుక..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యకు ఎంపికయ్యేదెవరు. సీఎం జగన్ ఎవరి పేర్లు ఖరారు చేయనున్నారు. ఏ సమీకరణాలు ప్రభావం చూపనున్నాయి. ఇప్పుడు అధికార వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గ విస్తరణ.. పార్టీ బాధ్యతల కేటాయింపులో సీఎం జగన్ అమలు చేసిన ఫార్ములాలే ఇక్కడ అమలు చేస్తారా..లేక, ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్ దాదాపుగా రాజ్యసభ సభ్యుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే, అనూహ్యంగా ఒక ప్రముఖ బీసీ నేతకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ పార్టీలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. అందులో ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయ సాయిరెడ్డి సైతం ఉన్నారు.

రెడ్డి వర్గం నుంచి రేసులో ఇద్దరు..

రెడ్డి వర్గం నుంచి రేసులో ఇద్దరు..

ఆయనకు రెన్యువల్ దక్కుతుందా లేదా అనే చర్చ సాగుతున్నా... తొలి నుంచి సీఎం జగన్ విధేయుడిగా.. ఢిల్లీలో కేంద్రం - ఏపీ ప్రభుత్వం ..అదే విధంగా రాజకీయ సంబంధాల విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో..ఆయనకు మరోసారి పదవి పొడిగింపు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో సినీ నిర్మాత - న్యాయవాది అయిన "ఆచార్య" ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి పేరు సైతం రేసులో ఉంది. కానీ, సాయిరెడ్డి - నిరంజన్ రెడ్డి ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావటంతో ఇద్దరికీ సీటు సాధ్యమేనా అనే చర్చ వినిపిస్తోంది.

కానీ, నిరంజన్ రెడ్డికి ఖాయమని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిరంజన్ రెడ్డిని ఎంపిక చేస్తారని చెప్పటం వెనుక అనేక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక, ఇదే సమయంలో బీసీ వర్గానికి ఈ సారి ఒక సీటు ఖాయమని చెబుతున్నారు.

బీసీలకు మరో సీటుకు అవకాశం

బీసీలకు మరో సీటుకు అవకాశం

కేబినెట్ విస్తరణ..పదవుల కేటాయింపులో ఇప్పటి వరకు బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఒకే సారి పిల్లి సుభాష్ చంద్రబోసు.. మోపిదేవి వెంకటరమణను తన కేబినెట్ నుంచి రాజ్యసభకు పంపి..ఒకే సారి రెండు సీట్లు బీసీలకు కేటాయించారు. ఇక, ఇప్పటి వరకు ఈ సారి రేసులో బీదా మస్తాన రావు పేరు బీసీ కోటాలో ప్రచారంలో నిలిచింది.

అయితే, నెల్లూరు జిల్లా సమీకరణం అడ్డుగా మారే ఛాన్స్ ఉంది. సాయిరెడ్డి సైతం నెల్లూరు జిల్లాకు చెందిన వారే. అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సైతం అదే జిల్లాకు చెందిన నేత..ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో..రెండు రాష్ట్రాల్లోనూ బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ క్రిష్ణయ్య పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గాల సమస్యల పైనా ఆయన పలు మార్లు సీఎం జగన్ ను కలిసారు.

కీలక బీసీ నేతకు ఛాన్స్ అంటూ

కీలక బీసీ నేతకు ఛాన్స్ అంటూ

బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన అభినందించారు. గతంలో ఆయన టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత పూర్తి టర్మ్ ఎమ్మెల్యేగా కొనసాగినా..టీడీపీకి దూరంగా ఉన్నారు. అయితే, తెలంగాణ నేతకు అవకాశం ఇస్తారా అనేది మరో సందేహం. కానీ, ఆర్ క్రిష్ణయ్య బీసీ వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు ఉండటంతో ఆయనకు అవకాశం ఇచ్చే అంశం పైన చర్చ జరుగుతన్నట్లుగా తెలుస్తోంది.

క్రిష్ణయ్య ను ఎంపిక చేయటం ద్వారా..టీడీపీకి చెక్ పెట్టినట్లు అవుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. కమ్మ వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనకు తాజాగా క్రిష్ణా - గుంటూరు జిల్లా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి అప్పగించారు.

మర్రి రాజశేఖర్ కు ఖాయంగా

మర్రి రాజశేఖర్ కు ఖాయంగా

2019 ఎన్నికల్లో మర్రికి సీటు నిరాకరించి విడదల రజనీకి సీటు ఇవ్వటంతో పాటుగా ఇప్పుడు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినా..సాధ్యపడకపోవటంతో...మర్రి రాజశేఖర్ పేరు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఖాయమని ప్రచార సాగుతోంది.

దీంతో.. విజయ సాయిరెడ్డి..నిరంజన్ రెడ్డి.. మర్రి రాజశేఖర్ పేర్లు ఖాయమని చెబుతున్న వేళ నాలుగో సీటు కోసం ఆర్ క్రిష్ణయ్య లేదా బీదా మస్తాన రావు..ఇద్దరూ కాకుంటే ఆదానీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పైన సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM Jagan Has Finalized the names to be sent to the Rajyasabha, Key BC Leader name also in the list as per reports
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X