Michaung Cyclone: ఏపీలో భారీ వర్షాలు.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు ఆదేశించిన సీఎం జగన్..

మిగ్‍జాం తుఫాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుఫాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు కేటాయించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

CM Jagan has made it clear that those who have lost due to heavy rains in AP should be supported on war footing

హుద్‌ హుద్‌ లాంటి పెద్ద తుఫానులను కూడా రాష్ట్రం చూసిందని.. అటువంటి తుఫాన్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం అధికారులకు ఉందన్నారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఈ 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలి. ఇప్పటికే 5 ఎన్డీఆర్‌ఎఫ్, మరో 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నాయని అధికాలు తెలిపారు.

మరోవైపున ఖరీప్‌ పంటల సంరక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా ధాన్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని సూచించారు. కోతకు వచ్చిన ఖరీప్‌ పంట కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశమన్నారు. ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించినట్లు చెప్పారు. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు.

తుఫాను ప్రభావంతో గాలులు, వర్షాలు వల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారి పట్ల మానవతా ధృక్ఫధంతో సాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తక్షణమే రూ.10 వేలు ఇచ్చి... వారిని ఆదుకోవాలన్నారు. వారు కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేట్టు దయతో, సానుభూతితో అందించాలన్నారు. సకాలంలో పరిహారం అందించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+