తల వంచను, భయం లేకపోతే పొత్తులెందుకు - జగన్ సమరనాదం..!!
తన పాలనకు ప్రజా మద్దతు..జనం బలం లేకపోతే చంద్రబాబుకు పొత్తులు ఎందుకని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఈ సారి ఫ్యాన్ గెలిస్తే చంద్రబాబు బెడద ఇక శాశ్వతంగా ఉందని చెప్పుకొచ్చారు. పొరపాటు జరిగితే చంద్రబాబు గ్లాస్ పట్టుకొని సైకిల్ ఎక్కి పేదవాడి రక్తం తాగుతారని వ్యాఖ్యానించారు ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటానని జగన్ స్పష్టం చేసారు. పేదవాడి తరపున యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. 25 ఎంపీ, 175 అసెంబ్లీ గెలవాల్సిందేనని నిర్దేశించారు.
కీలక వ్యాఖ్యలు : రాప్తాడు సిద్దం సభలో సీఎం జగన్ చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పైన పోరాటానికి ఇంత మంది ఏకం అయ్యారని చెప్పారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే అండగా నివాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు సిద్దమని పోస్టర్లు వేయిస్తున్నారని..దేనికి ఆయన సిద్దమని ప్రశ్నించారు. దుష్టచతుష్ఠయం ముందు తల వంచేనని జగన్ స్పష్టం చేసారు. వారి బాణాలకు బలి కావటానికి తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడినని చెప్పుకొచ్చారు. తనకు కోట్లాడి గుండెలు తోడుగా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. జగన్ మంచి చేయలేదనుకుంటే ..జగన్ కు ప్రజా బలం లేదని నమ్మితే చంద్రబాబుకు పొత్తులు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు సైకిల్ తోయటానికి ప్యాకేజీ స్టార్ ఎందుకి నిలదీసారు.

చంద్రబాబుకు ఎందుకు భయం : జగన్ ప్రతీ ఇంటికి మంచి..ప్రతీ ఇంట్లోనూ వైసీపీ చేసిన మంచి గురించి చంద్రబాబుకు తెలుసన్నారు. ప్రతీ ఇంటా తనకు మద్దతు కావాలని కోరారు. ప్రతీ ఇంటా మార్పు కనిపిస్తోందని చెప్పారు. తన పాలనలో 57 నెలల్లో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని..35 లక్షల ఇంటి స్థలాలు నిరు పేదలకు అందించామని చెప్పుకొచ్చారు. ఒకాసారి ఆశీర్వదిస్తే ఇంత మంచి చేసామని..మరోసారి ఛాన్స్ ఇస్తే మరింత మంచి జరుగుతుందని వివరించారు. చంద్రబాబు కు ఓటు వేస్తే సంక్షేమానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయటమేనని జగన్ అలర్ట్ చేసారు. 99 శాతం మేనిఫెస్టోను అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్న పార్టీ దేశంలో వైసీపీ ఒక్కటేనని జగన్ వించారు. ఇలాంటి సంక్షేమ పథకాలు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారో ప్రశ్నించాలని సూచించారు. వైసీపీ కార్యకర్తల పార్టీనని.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామని చెప్ాపరు.

ఎక్కడా తగ్గలేదు : 57 నెలల పరిపాలనలో ఎక్కడా తగ్గలేదన్నారు. ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా తగ్గేలేదే లేదన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందార్ల -పేదల మధ్య పోటీగా పేర్కొన్నారు. పేదవాడి భవిష్యత్ కోసం యుద్దానికి సిద్దం అని జగన్ చెప్పుకొచ్చారు. మరో 55 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నామని అప్రమత్తం చేసారు. టీడీపీ మీడియా చేసే ప్రచారం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయటానికి సిద్దం కావాలన్నారు. ఈ ఎన్నికల్లో ఓడితే టీడీపీ రూపురేఖలు కనిపించవని చెప్పుకొచ్చారు. రెండు జాతీయ పార్టీల్లో ఒకరితో ప్రత్యక్షంగా..మరొకరికితో పరోక్షంగా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. తోడేళ్లను ఎదుర్కోవాలంటే ప్రతీ గుండె తోడుగా ఉండాలన్నారు. తేడా జరిగితే పేదవాడి జీవితం అతలాకుతలం అవుతుందని జగన్ అప్రమత్తం చేసారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications