ఆ ఒక్క నిర్ణయం.. జగన్ లక్కు మార్చేసిందా..!!
ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతుంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు, రేపు టిడిపి అధినేత చంద్రబాబు, సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ ముందు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. జగన్ వ్యూహాల పై ప్రత్యర్ధి పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.
జగన్ తాజా వ్యూహాలు
ఏపీలో ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఓటర్ల ను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈరోజు, రేపు పోలింగ్ చివరి సమయం కావటంతో ముఖ్యమంత్రి జగన్.. టిడిపి భారీగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పై ఫోకస్ చేసారు. ఈరోజు చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి, సాయంత్రం కడప ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు. మంత్రి రోజా నగరిలో వెనుకబడి ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ రోజాని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. మంగళగిరిలో బీసీ కార్డు ద్వారా లోకేష్ కు చెక్కు పెట్టాలని వైసిపి భావిస్తుంది.

ఆ నియోజకవర్గాలపై గురి
బీసీ నియోజకవర్గం లోకేష్ పోటీ చేస్తున్నారే అంశాన్ని బలంగా స్థానికంగా తీసుకువెళ్తుంది. ఈరోజు మంగళగిరిలో జగన్ ప్రచారంలో భాగంగా ఆయన చేసే వ్యాఖ్యల పైన ఆసక్తి కనిపిస్తుంది. ఆ తర్వాత నగరిలో జగన్ సొంత పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి దిశ నిర్దేశం చేస్తారు... రోజా గెలుపుకు ఎలాంటి కార్యాచరణ డిసైడ్ చేస్తారనేది మరో ఆసక్తికరమైన అంశం. కడప ఎన్నికల ప్రచార సభలో జగన్ ముస్లిం రిజర్వేషన్ల పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ నేతలు మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చేస్తున్న ప్రచారంతో జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు. ఈరోజు కడపలో మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇక తాజాగా డిబిటి పథకాల నగదు బదిలీకి కోర్టు ఒక్కరోజు అనుమతి ఇచ్చింది.

జగన్ కు కలిసొచ్చేనా
లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు నగదు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని కండిషన్లను విధించింది. ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు ఈ పథకాలు అందటం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే తాము ఐదేళ్ల కాలంగా అమలు చేస్తున్న పథకాల్లో కొనసాగింపుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. అటు ఎన్డీఏ కూటమి తమదే విజయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ సమయంలో జగన్ తన ఎన్నికల ప్రచారంలో చివరి సభకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ఎంపిక చేసుకున్నారు. అక్కడ జగన్ కీలక ప్రసంగంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారు. దీంతో ఈ చివరి రెండు రోజుల పరిణామాలు ఎన్నికల్లో గెలుపుకు కీలక మలుపు కానుంది.












Click it and Unblock the Notifications