అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం - సీఎం జగన్..!!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఇప్పటికే తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి పలు కార్యక్రామలకు హాజరయ్యారు. తిరుపతిలో ప్రతిష్ఠాత్మక శ్రీనివాస సేతును ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు సుదీర్ఘ కలగా నిలిచిన ఇంటి స్థలాలను సీఎం పంపిణీ చేసారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపన సీఎం జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు పంపిణీ చేయనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం శ్రీవారిని సీఎం దర్శించుకోనున్నారు.

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీపద్మావతిపురంలో రూ.684 కోట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ను సీఎం జగన్ ప్రారంభించారు. గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరించారు. ఈ నూతన ఫ్లై ఓవర్ డు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్‌ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయని చెప్పారు. వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

CM Jagan

టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశామని చెప్పారు. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తామని, ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నామన్నారు. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇదని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల 60 ఏళ్ల సొంతింటి కల సీఎం జగన్ సాకారం చేసారని టీటీడీ ఛైర్మన్ భూమన పేర్కొన్నారు.

నాడు టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వైఎస్సార్ నిర్ణయించారని గుర్తు చేసారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయంగా పేర్కొననారు. సీఎం జగన్‌ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యిందని భూమన చెప్పుకొచ్చారు. తరువాత సీఎం జగన్ గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. రాత్రికి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనున్న సీఎం..రేపు ఉదయం శ్రీవారిని దర్శించు కోనున్నారు. ఆ తరువాత నంద్యాల, కర్నూలు జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+