విమర్శకులకు సీఎం జగన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్!
వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకులకు స్పష్టం చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ అన్నింటిలో ఎందుకు గెలవలేమని నాయకులను ప్రశ్నిస్తున్నారు. అందరూ సరిగా పనిచేస్తే అన్ని నియోజకవర్గాలు వైసీపీ పరమవుతాయని జగన్ చెబుతున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గం ముఖం చూడని ఎమ్మెల్యేలను కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో పరుగులు పెట్టిస్తున్నారు.

సర్వేలు తెప్పించుకుంటున్నారు..
వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరడమే ఆశయంగా ఆయన పనితీరు ఉంది. ఎవరి విమర్శలను పట్టించుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వాధికారులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో నాయకులందరి జాతకాలపై సర్వేలు చేయించి వివరాలు తెప్పించుకుంటున్నారు. పనితీరు బాగోని ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్నవారికే టికెట్లు ఇస్తానని ముందే చెప్పేస్తున్నారు.

విమర్శకులకు గట్టిగా సమాధానం ఇస్తూ..
జగన్ తాజాగా గృహసారథులు అనే మరో కాన్సెప్టును తీసుకువవచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఉగాది రోజు నుంచి వీరు కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు చేరువవుతారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడంలేదు అనే విమర్శలకు సమాధానమిస్తూ ఆయన పల్లెనిద్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నాయకులకు, అధికారులకు పరిమితమైన పల్లెనిద్రను ఇకనుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా చేయబోతున్నారు.

గ్రామాల సమస్యలు పరిష్కారమవుతాయి
వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతివారం మూడురోజులపాటు కచ్చితంగా పల్లె లో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. జగన్ గడప దాటడంలేదు అనేవారికి పల్లెనిద్ర ద్వారా షాక్ ఇవ్వనున్నారు. పల్లె నిద్ర వల్ల ఆయా గ్రామాల్లోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎన్నికలనే లక్ష్యంగా నిర్ధేశించుకొని జగన్ ముందుకు వెళుతున్నారు. ఈ ప్రయోగం ఎంతమేరకు విజయవంతమవుతుందో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications