ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం - ప్రతిపక్షాలపై కొత్త అస్త్రం..!!

వై నాట్ 175. ముఖ్యమంత్రి నినాదం - లక్ష్యం. తిరిగి అధికారంలోకి రావటం కోసం ముఖ్యమంత్రి జగన్ ధీమాగానే ఉన్నా..ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎన్నికల వేళ..పొత్తులు..యాత్రల పేరుతో తనను టార్గెట్ చేస్తన్న వేళ.. ప్రజల మధ్య నుంచే వారిని ఎదుర్కోవటానికి జగన్ సిద్దం అయ్యారు. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రతో 151 సీట్లతో అధికారం దక్కించుకున్న జగన్..ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రజల నుంచే పాలన పైన స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ..వారి మద్దతు మరింత పొందుతూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో..ఇక ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్దమయ్యారు.బస్సు యాత్ర - పల్లె నిద్రకు నిర్ణయించారు.

ఇక ప్రజల్లోకి ముఖ్యమంత్రి జగన్..

ఇక ప్రజల్లోకి ముఖ్యమంత్రి జగన్..


తన తండ్రి మరణం తరువాత పావురాల గుట్టలో ఇచ్చిన మాటతో మొదలు ప్రతీ సందర్భంలోనూ జగన్ ప్రజలతోనే ఉన్నారు. ఇప్పుడు సీఎం హోదాలోనే ఇక గ్రామ స్థాయి ప్రజలతో మమేకం కానున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను పూర్తి చేసామని ప్రభుత్వం చెబుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఆచరణ రూపంలోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో జగన్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు యాత్రల పేరుతో ప్రజల మధ్యలోకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో తన ఎమ్మెల్యేలను ప్రతీ ఇంటికి పంపిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తానే ప్రజల్లోకి వెళ్లనున్నారు. తన ప్రభుత్వ పాలన ..సంక్షేమం అమలు పైన నేరుగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ప్రజలతో మరోసారి మమేకం కావటం ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు.

బస్సు యాత్ర - పల్లెనిద్రకు నిర్ణయం

బస్సు యాత్ర - పల్లెనిద్రకు నిర్ణయం


ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రజా బాట పట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ మండలం కవర్ చేస్తూ.. ఆ మండలంలోని ఒకటి లేదా రెండు గ్రామలను ఎంపిక చేసుకొని అక్కడి ప్రజలతో రచ్చ బండ నిర్వహించనున్నారు. పల్లె నిద్ర చేయనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పల్లె నిద్ర చేయాని నిర్ణయించటం ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్షాలకు మింగుడు పడని విషయంగా మారనుంది .తన పాలన..సంక్షేమం..ప్రజాభిప్రాయాలను స్వయంగా ఆరా తీయనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. అదే సమయంలో పార్టీ పరంగానూ క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన స్వయంగా ఫోకస్ చేయనున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్దులను ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి సర్వేల ద్వారా తనకు నివేదికలు అందుతున్నా.. ప్రజానాడి స్వయంగా తెలుసుకొనేందుకు రంగంలోకి దిగుతున్నారు.

ప్రతిపక్షాలకు చెక్ - ప్రజలతో మమేకం..

ప్రతిపక్షాలకు చెక్ - ప్రజలతో మమేకం..


ప్రతిపక్ష పార్టీలు యాత్ర పేరుతో తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్న వేళ..దానిని ప్రజల మధ్యనే ఉంటూ..ఎదుర్కోవటానికి..తిప్పి కొట్టటానికి జగన్ నిర్ణయించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ప్రజలతో మమేకం అవుతూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టనున్నారు. ప్రతీ గ్రామంలోనూ ఇప్పటి వరకు తన పాలనలో ఎన్ని కుటుంబాలకు ఎంత మేర లబ్ది చేకూరిందనేది సీఎం స్వయంగా వివరించనున్నారు. దీని ద్వారా ప్రతీ గ్రామంతోనూ సీఎం మమేకం కానున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాల యాత్రలను రాజకీయంగానూ డామినేట చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్ళేందుకు సరికొత్త కార్యక్రమనికి వైసీపీ శ్రీకారం చుడుతోంది. జగనన్నే మన భవిష్యత్తు పేరుతో కొత్త కార్యక్రమం
సిద్దం చేస్తున్నారు. ఇక..ఇప్పుడు సీఎం బస్సు యాత్ర -పల్లెనిద్ర నిర్ణయం రాజకీయంగా ఏపీలో కొత్త మలుపుకు కారణం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+