అన్నీ పక్కన పెట్టండి, బుర్రకెక్కించుకోండి - ఒబేరాయ్ హోటల్స్ కు జగన్ శంకుస్థాపన..!!
ఏపీలో మూడు ప్రాంతాల్లో ఒబేరాయ్ హోటల్స్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనల చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు ఒబెరాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్స్ హోటల్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో గండికోటలో హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేశారు. అదే విధంగా విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు.
మూడు సెవన్ స్టార్ హోటల్స్: కడప జిల్లా పర్యటలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రానున్న రోజుల్లో గండికోట ప్రఖ్యాత టూరిజం స్పాట్ గా మారుతుందన్నారు. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

గండికోటకు మరో స్టార్ గ్రూపును కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గోల్ఫ్ కోర్టును కూడా ఏర్పాటు చేయాని ఓబేరాయ్ ను సీఎం కోరారు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటామని జగన్ ప్రకటించారు. కొప్పర్తిలో డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
అర్దం చేసుకోండి..సహకరించండి: జమ్మలమడుగులో వస్తున్న ఈ సెవన్ స్టార్ హోటల్ ద్వారా ఈ ప్రాంతానికే కాదని, రాష్ట్రానికే గుర్తుంపని మఖ్యమంత్రి పేర్కొన్నారు. పెట్టబడులు పెట్టేవారు ఇక్కడ రెప్యుటేషన్ గుర్తించి ముందుకు వస్తారని చెప్పారు. ఉద్యోగాలతో సహా ఏది ఉన్నా కూర్చొని మాట్లాడుకుందామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. జమ్మలమడుగులో ఉన్న వారు దీనిని ఆలోచన చేయాలన్నారు.
మనస్పర్ధలు పక్కన పెట్టాలని సూచించారు. ఇది తన రిక్వెస్ట్ అని..బుర్రలోకి ఎక్కించుకవాలంటూ సీఎం వ్యాఖ్యానించారు. సీఎస్ జవహర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారేనని.. ఈ ప్రాంతం కోసం మంచి ఆలోచనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జమ్మల మడుగులో స్టీల్ ఫ్యాక్టరీకి 15వ తేదీ తరువాత అన్ని అనుమతులు వస్తాయని జగన్ వెల్లడించారు.
వైయస్ఆర్ జిల్లా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్.. సెవెన్ స్టార్ హోటల్స్‌ని నిర్మించనుంది. గండికోటతో పాటు తిరుపతి, విశాఖపట్నంలో ఈ హోటల్స్ నిర్మాణం జరగనున్నాయి. #YSJaganDevelopsAP #Gandikota pic.twitter.com/kj3Z3Evhvx
— YSR Congress Party (@YSRCParty) July 9, 2023
జగన్ పేరు కు మంత్రి రోజా కొత్త విశ్లేషణ: మంత్రి రోజా సీఎం జగన్ పేరుకు కొత్త అబ్రివేషన్ చెప్పారు. జే ఫర్ జస్టిస్..ఏ ఫర్ అష్యూరెన్స్..జీ ఫర్ గుడ్ గవర్నెన్స్..ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్..ఎన్ ఫర్ నో కాంప్రమైజ్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారని వివరించారు. ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. రికార్డు క్రియేట్ చేయాలన్నా.. బద్ధలుగొట్టాలన్నా సీఎం జగన్‌కే సాధ్యమని రోజా విశ్లేషించారు. చంద్రబాబు విజన్ అంటూ కబుర్లు చెప్పారని ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేసారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications