Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినాష్ సీటు మార్పు, కడపలో జగన్ కొత్త లెక్కలు - వారసుల ఎంట్రీ..!!

ముఖ్యమంత్రి జగన్ అంతు చిక్కని వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంఛార్జ్ ల మార్పు పైన కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల కడప పర్యటనలో జిల్లాలోనూ మార్పుల గురించి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి వైఎస్సార్ కుటుంబం నుంచి కొత్త జనరేషన్ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

జగన్ నిర్ణయాలు: సీఎం జగన్ తన సొంత జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల పైన తాజా సర్వే నివేదికల ఆధారంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో అవినాష్ వరుసగా గెలుపొందారు.

CM Jagan likely to Field new candidate for Kadapa loksabha, Aviansh to contest for Jammalamadugu Assembly

ముఖ్యమంత్రి జగన్ తన నియోజవకర్గంలో సమస్యల పరిష్కారానికి.. పార్టీ వ్యవహారాలను ఎంపీ అవినాష్ కు అప్పగించారు. అవినాష్ అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా వైఎస్ భాస్కరెడ్డి పులివెందులలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. తాజా మార్పుల ఆలోచనల్లో భాగంగా అవినాష్ ను వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు: ఎన్నికల సీజన్ ప్రారంభం కావటంతో వైఎస్ ఫ్యామిలీలోని వారసులు తెర పైకి వచ్చారు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్నారు. కడప ఎంపీగా డాక్టర్ అభిషేక్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి రాజకీయంగా తెర మీదకు వచ్చింది.

ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్‌. ఈయన భార్య కూడా డాక్టరే. అభిషేక్‌రెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

వారసులకు ఛాన్స్: ఎంపీ అవినాష్ ను జమ్మలమడుగు నుంచి పోటీకి దింపితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ కు బంధువు అయిన దుష్యంత్ రెడ్డికి కమలాపురం సీటు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. క‌మలాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం తాటిమాకుల‌ప‌ల్లె దుష్యంత్ రెడ్డి స్వ‌గ్రామం. 2019లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా నియమితుల‌య్యారు.

2009లోనే దుష్యంత్ రెడ్డి క‌మ‌లాపురం టికెట్‌ ఆశించారు. ఈసారి అతనికి టికెట్ తప్పకుండా వస్తుందని అందరూ భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త గా కూడా కావటంతో ఈ సారి సీటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో..కడప జిల్లాలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+