ఆళ్ల రామకృష్ణారెడ్డి కి ఎమ్మెల్యే సీటు - మంత్రి అంబటి సీటు మార్పు..!!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ఆర్కే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అదే విధంగా మంత్రి అంబటి రాంబాబు సీటు మార్పు ఖాయమని చెబుతున్నారు. అమరావతి పరిధిలో ప్రతీ సీటు కీలకంగా భావిస్తున్న సీఎం జగన్..సామాజిక సమీకరణాలు..ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దుల ఆధారంగా తాజా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కొత్త లెక్కలు: మంగళగిరి నుంచి రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీడారు. తిరిగి వైసీపీలో చేరారు. రీ ఎంట్రీ వేళ ఆయన పోటీకి స్పష్టమైన హామీ లభించింది. మంగళగిరిలో లోకేష్ పైన వైసీపీ బీసీ అభ్యర్దిని బరిలోకి దించింది. అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపస్తానని తాజాగా ఆర్కే చెప్పుకొచ్చారు. గంజి చిరంజీవి ప్రస్తుతం మంగళగిరి ఇంఛార్జ్ గా ఉన్నారు.

CM Jagan likely to field RK from Sattenapalle, Ambati Ramabu to contest as AP

అవసరమైతే అభ్యర్ది మార్పు ఉంటుందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇప్పుడు ఆర్కే రీ ఎంట్రీతో పార్టీకి మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఆర్కేకు వైసీపీ నుంచి ఈ సారి సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి ఆర్కే పోటీ చేయనున్నట్లు సమాచారం. సత్తెన పల్లిలో ఆర్కేకు బంధుగణంతో పాటుగా సామాజిక వర్గాల లెక్కల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు.

మార్పులు - చేర్పులు: సత్తెనపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబును పార్టీ ప్రకటించింది. అదే సమయంలో అవనిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేసింది. కానీ, తన వయోభారం కారణంతా తన కుమారుడుకు సీటు ఇవ్వాలని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు.

దీని పైన పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తాను ఎంపీగా అయినా..ఎమ్మెల్యేగా అయినా పోటీకి సిద్దమని..జగన్ సూచనల మేరకు పోటీ చేస్తానని స్పష్టం చేసారు. దీంతో, ఆర్కే కు సత్తెనపల్లి కేటాయించి..మచిలీపట్నం ఎంపీగా అంబటిని పోటీకి దింపాలని తాజాగా ఆలోచన జరుగుతోంది. సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్దిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు.

ఎన్నికల బరిలో ఆర్కే: సత్తెనపల్లిలో ఆర్కే ను బరిలోకి దింపటం ద్వారా స్థానిక సమీకరణాలు కలిసి వస్తాయనే వైసీపీ నేతల అంచనా. సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పించి ఎంపీగా ఇవ్వటం ద్వారా ప్రమోషన్ గా భావిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిగా టీడీపీ -జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేయనున్నారు. ఆయన పైన అంబటిని పోటీకి దించటం ద్వారా స్థానికంగా సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇద్దరు గుంటూరు జిల్లా నేతలే కావటంతో అక్కడ ఈ నిర్ణయం అమలు దిశగా ఆలోచన జరుగుతోంది. నర్సరావు పేట ఎంపీగా బీసీ వర్గానికి చెందిన అనిల్ ను ప్రకటించటంతో సత్తెనపల్లిలో రెడ్డి వర్గానికి ఇవ్వటం ద్వారా కన్నాకు చెక్ పెట్టవచ్చనేది వైసీపీ వ్యూహం. ఈ మార్పుల పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+