ప్యాకేజీ స్టార్ జీవితమే చంద్రబాబు కోసం - మీ బిడ్డ భయపడడు: సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాల పొత్తులు..ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన వ్యాన్ చూసుకొని ప్యాకేజీ స్టార్ మురిసిసోతున్నారని సీఎం ఎద్దేవా చేసారు. తాను అసెంబ్లీకి వస్తానంటూ దత్తపత్రుడు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తనకు చిన్నా చితక పార్టీల మద్దతు అసవరం లేదని తేల్చి చెప్పారు. మీ బిడ్డ వీళ్లకు భయపడడని..తన నమ్మకం ఒక్కటేనని సీఎం జగన్ స్పష్టం చేసారు. మంచి జరిగితే మీరే సైనికులు కావాలంటూ పిలుపునిచ్చారు.
టిడ్కో ఇళ్ల ప్రారంభం : గుడివాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం జగన్ లబ్ధిదారులకు అందజేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. ఒక్క రూపాయికే ఉచితంగా అందిస్తానని ఇదే గుడివాడ బహిరంగ సభ సాక్షిగా చెప్పానని... ఎన్నికల సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదే గుడివాడలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నారంటూ చంద్రబాబుపై సెటైర్లు వేసారు. గుడివాడ అల్లుడినని చెప్పుకుంటారని ఎద్దేవా చేసారు.

చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో గుడివాడలోని పేదలకు ఒక్క సెంటు ఇచ్చిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు కట్టించింది లేదు.. ఒక్క సెంటు స్థలం ఇచ్చింది లేదని వివరించారు. 30.60 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
మరో హామీ నిలబెట్టుకున్నాను : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో అక్షరాల 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల కాలనీలు నిర్మిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.ఒక్కో ఇంటి పట్టా విలువ ఆ స్థలం, ఏరియాను బట్టి కనీసం రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.10 లక్షల వరకు ఇచ్చినట్టు అయ్యిందని వివరించారు.
టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేసారని ఫైర్ అయ్యారు. తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం తప్ప.. చంద్బరాబు ఆ గుమస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం చేసిందేంటని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేసారు.
పవన్..చంద్రబాబు లక్ష్యంగా : జనసేనాని పవన్ కు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అయినా చంద్రబాబు కోసమే తన జీవితమంటూ తన వాహనం చూసి ప్యాకేజీ స్టార్ మురిసిపోతున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేసారు. తాను కూడా ఎమ్మెల్యే అవుతానని..ఎవరు ఆపుతారో చూస్తానని దత్తపుత్రుడు అంటున్నారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. దుష్టచతుష్టయం ఒకవైపు..ప్రజలను నమ్ముకున్న తాను ఒక వైపు ఉన్నామని వివరించారు.

తాను వీరికి భయపడనని..తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏ మంచి చేయని చంద్రబాబు ఎన్నికల వేళ కొత్త వరాల పేరుతో మరోసారి మోసం చేయటానికి వస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పకొచ్చారు. ఏనాడు మంచి చేయని వాళ్ల మాటలు నమ్మవద్దని సీఎం జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications