YS Jagan:అభ్యర్థుల ఖరారులో జగన్ కొత్త ఫార్ములా - కీలక మార్పులు, ఇదీ లెక్క..!!
వై నాట్ 175. ఇదీ సీఎం జగన్ నినాదం. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినా తనదే విజయమనే ధీమాతో జగన్ ఉన్నారు. అదే సమయంలో పూర్తిగా అలర్ట్ అయ్యారు. పార్టీ - పాలనా పరంగా ప్రతీ అంశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపికలో ఊహించని సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీతో పాటుగానే లోక్ సభ అభ్యర్దుల ఎంపిక పైన ఫోకస్ చేసారు. కొందరు సీనియర్లు..మంత్రులను లోక్ సభ బరిలో దించేందుకు నిర్ణయించారు.
ఎంపీ - ఎమ్మెల్యే అభ్యర్దుల కసరత్తు: అసెంబ్లీ -లోక్ సభ సీట్లలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం. ఇందులో ప్రాంతీయ - సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్దులు తెర మీదకు వస్తున్నారు. కొందరు ప్రస్తుత ఎంపీలను అసెంబ్లీకి..కొందరు సీనియర్లను లోక్ సభకు పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను నిడుదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది. రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు లేదా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇదే సమయంలో చలమల శెట్టి సునీల్ రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
గెలుపే ప్రామాణికంగా: గుంటూరు, విజయవాడ స్థానాల్లో లోక్ సభ అభ్యర్దుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక, నర్సరావు పేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఏలూరు ఎంపీ అభ్యర్ది మార్పు ఖాయమని చెబుతున్నారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది. నరసాపురం నుంచి అన్నీ అనుకూలిస్తే సినీ హరో దివంగత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలను బరిలోకి దింపేలా ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేసారని తెలుస్తోంది.
శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు. ఒంగోలు నుంచి కరణం బలరాంను బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచన గా సమాచారం. హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్దిగా టీఎస్ దీపిక పేరు ఖాయమైంది.

సీనియర్లకు స్థాన చలనం: అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. విజయనగరం నుంచి మంత్రి బొత్సా ను బరిలోకి దింపటం పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. అయితే, బొత్స సతీమణికి ఇవ్వటం పైనా చర్చ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండటంతో..వారికి కేటాయిస్తారని సమాచారం.
ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు. ఇక, శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయమైంది. దీంతో..జగన్ చేస్తున్న ఎంపిక పైన పార్టీలో ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications