చంద్రబాబుకు సీఎం జగన్ ఛాలెంజ్ - సిద్దమా : కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. బహిరంగ సవాల్ చేసారు. సెల్ఫీల పేరుతో నాలుగు ఫేక్ ఫొటోలు కాదంటూ అసలైన సెల్ఫీ ఏంటో వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతీ పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగవా ..అంటూ ముఖ్యమంత్రి జగన్ ఛాలెంజ్ చేసారు. ప్రతీ ఒక్కరు చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి కూడా ఎందుకు సాయం చేయలేదని నిలదీయాలని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు తొలి టన్నెల్ పూర్తయింది. రెండో టన్నెల్ లో ఈ అక్టోబర్ లో పూర్తి చేసి.. ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తానని ప్రకటించారు.
ఆ ముసలాయన పాలనలో: ఇప్పుడు జగన్ ఇస్తున్నట్లుగా ఆ ముసలాయన పాలనలో ఎందుకు మీ ఖాతాల్లో నగదు రాలేదో ఆలోచించాలని ముఖ్యమంత్రి సూచించారు. 46 నెలల కాలంలో 2.07 లక్షల కోట్లు మీ ఖాతాల్లో బదిలీ అయిందని వివరించారు. ఎక్కడా లేని విధంగా సాధ్యం చేసామని చెప్పారు. ఈ డబ్బంతా గత చంద్రబాబు పాలనలో ఏమైందో నిలదీచాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఎవరు తిన్నారు. ఎవరు దోచుకున్నారు ఆలోచన చేయండి అంటూ సూచించారు.

చంద్రబాబు హయాంలో ఈ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. నాటి పాలన..నేటి పాలనకు తేడా గమనించాలని కోరారు. ఇంత మంచి చేస్తున్న మా బిడ్డ జగన్ తో కాకుండా నీతో ఎలా సెల్పీ దిగుతాం..అసలు ఆ నైతికత మీకు ఉందా అంటూ నిలదీయాలని జగన్ సూచించారు. మంది చేయటం అంటే మద్దుతు మీడియా అధినేతల ఇంటికి, దత్తపుత్రుడు ఇళ్లకు మూటలు పంపటమా అని ప్రశ్నించాలని జగన్ సూచించారు.
మీ జగన్ గా అడుగుతున్నా: గతంలో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చూపించిన సినిమా గుర్తు ఉంచుకోవాలని జగన్ సూచించారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీ సందర్భంలో తాను ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరింతగా అబద్దాలు చెబుతారని,.గజ దొంగల ముఠా ఒక్కటవుతుందని చెప్పారు.

తాను ప్రజలను..దేవుడిని నమ్ముకున్నానని స్పష్టం చేసారు. తాను నమ్ముకున్నది ప్రజలనేనని.. ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేది గుర్తించాలని.. మంచి జరిగితే మీరే సైనికులు కావాలని ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధించారు. వెలుగొండ ప్రాజెక్టు తొలి టన్నెల్ పూర్తయింది. రెండో టన్నెల్ లో ఈ అక్టోబర్ లో పూర్తి చేసి.. ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తానని ప్రకటించారు. దేవుడి మీద భక్తి అంటే 46 గుడులను కూలగొట్టటం..మైనార్టీలపై దేశ ద్రోహం కేసులు పెట్టటమా అని జగన్ ప్రశ్నించారు. అబద్దాల బ్యాచ్ ను నమ్మవద్దని సూచించారు.
చంద్రబాబును నిలదీయండి: అయిదేళ్ల పాలనలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని మన ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాల ఇంటి స్థలాల ముందు సెల్ఫీ దిగే అర్హత ఉందా అని అడగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏం మంచి చేసావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తున్నామని నిలదీయండని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నాలుగు లక్షల 39వేల మంది ఖాతాల్లో రూ 658.60 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేసారు. రెండు విడతల్లోనూ రూ 1,258 కోట్లు అందించామని చెప్పుకొచ్చారు.

ప్రతీ ఏటా 15 వేల రూపాయాల చొప్పున మూడేళ్లల్లో 45 వేల చొప్పున ఆర్దిక సాయం అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా వారంతటగా వారు స్వంత వ్యాపారలు చేసుకొని వారి కాళ్ల మీద వారు నిలబడేలా తోడ్పాటు అందించటమే లక్ష్యమని జగన్ స్పష్టం చేసారు. మహిళా సాధికారికత దిశగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. మిగిలిన రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం అధ్యయనం చేస్తున్నారు. వారి రాష్ట్రాల్లో అమలుకు ఆలోచన చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications