అన్నిటీకి ఇదే సమాధానం - సోషల్ మీడియా లో జగన్ పిక్ వైరల్..!!
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అభ్యర్దుల ఖరారు పై కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గాల్లో మార్పులు సంచలనంగా మారుతోంది. ఇదే సమయంలో జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. ఇదే సమయంలో జగన్ జన్మదిన వేడకులకు అభిమానులు సిద్దమయ్యారు. జగన్ కు సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో జగన్ తన పాలనలో జరిగిన సంక్షేమం తనకు తిరిగి అధికారం అందిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ నెల 21న జగన్ జన్మదినం. ఈ సారి జగన్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి.

ఈ సమయంలోనే జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నీ తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఒక పిక్ విడుదల అయింది. పేదల కోసం జగన్ అనే థీమ్ తో విడుదల చేసిన పిక్ ఇప్పుడు వైల్ అవుతోంది. పార్టీ శ్రేణులుతో పాటుగా అభిమానులు ప్రస్తుతం ఈ పిక్ ను వాట్సప్, సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా వినియోగిస్తున్నారు.
ఈ పిక్ ను ఫ్లెక్సీలు మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసారు. ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు.

సీఎం వైయస్ పాలనలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే.. ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కల్లా చూస్తున్నట్టున్న ఈ చిత్రం వైయస్ఆర్‌సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో సమకాలిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరువ చేసింది.












Click it and Unblock the Notifications