నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ జిల్లా పర్యటనలు : పధకాలు - పార్టీ పైనా నేరుగా : ఇక..ప్రజల్లోనే ఉండేలా..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రజల్లకి వెళ్లాలని నిర్ణయించారు. ఆయన వరుస జిల్లాల పర్యటనలకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఎంతో కాలంగా రచ్చబండ..పథకాల అమలు తీరును ప్రజల్లోనే సమీక్షించాలని సీఎం జగన్ భావించారు. అయితే, కరోనా కారణంగా రెండేళ్లుగా సాధ్యపడలేదు. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం..ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కేబినెట్ ఏర్పాటు తో పాటుగా పార్టీ పరంగా జిల్లాలు - రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం పూర్తి కావటంతో..ఇక, తాను రంగంలోకి దిగాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వేదిక నుంచే జగన్ 2024 ఎన్నికల సమర శంఖం పూరించేందుకు రంగం చేసుకుంటున్నారు.

జిల్లా పర్యటనలతో ..ఇక ప్రజల్లోనే

జిల్లా పర్యటనలతో ..ఇక ప్రజల్లోనే

ఇంకా రేండేళ్ల పాటు ఎన్నికలకు సమయం ఉన్నా..ముందస్తుగానే సిద్దం అయ్యేందుకు కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ప్రభుత్వ వర్గాలు సీఎం జగన్ జిల్లా పర్యటనలకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేస్తున్నాయి. ప్రభుత్వం. సీఎం పర్యటనల నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేయాల్సిందిగా ఆర్టీసీకి ఆదేశాలు అందాయి.

దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుచ పాంట్రీ వాహనం కండిషన్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. గతంలో 2009, 2015 సంవత్సరాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు వాడకపోవడంతో ఇక నుంచి జగన్ చేసే పర్యటనల్లో అన్నీ బుల్లెట్ ఫ్రూప్ వాహనాలే వుండనున్నాయి.

ప్రభుత్వ పథకాలు..పార్టీ పరిస్థితిపై

ప్రభుత్వ పథకాలు..పార్టీ పరిస్థితిపై

త్వరలోనే సీఎం జిల్లా పర్యటనలు ఉంటాయనే సూచనలతో అధికారులు వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం జగన్ తన జిల్లా పర్యటనల్లో రచ్చబండ నిర్వహణకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా గ్రామాల వారీగా రచ్చబండ.. సచివాలయాల సందర్శన..సచివాలయాల సందర్శన. .గడప గడపకు వైసీపీ కార్యక్రమాల్లో స్వయగా పాల్గొనాలని భావిస్తున్నట్లు సమాచారం.

దీని ద్వారా మంత్రుల్లోనూ..పార్టీ నేతలు సైతం పార్టీ ఇప్పటికే నిర్ణయించిన విధంగా మరింత అప్రమత్తంగా కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పుడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు పైన సీఎం స్వయంగా ఆరా తీయనున్నారు. లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.

నేరుగా పరిశీలన.. కీలక నిర్ణయాల దిశగా

నేరుగా పరిశీలన.. కీలక నిర్ణయాల దిశగా

జిల్లాల పర్యటన సమయంలో పార్టీ పరిస్థితుల పైన జగన్ ఫోకస్ చేయనున్నారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యల పైన ఇప్పటికే జగన్ ఫోకస్ పెట్టారు. సంక్షేమ హాస్టళ్లను సైతం ఆకస్మితంగా తనిఖీలకు ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లాల్లో ఆస్పత్రులు - పాఠశాలలను సీఎం తనిఖీలు చేయనున్నారు. నాడు -నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

దీంతో.. నాడు నేడు లో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించటంతో పాటుగా.. అవసరమైన మార్పులు - చేర్పులు సూచించనున్నారు. వారంలో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించేలా సీఎం జగన్ తన ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
CM JAgan Planning to district tours to monitor welfare schemes and party situation in ground level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X