మహిళల ఖాతాల్లో రూ 2.25 లక్షల కోట్లు - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
తనది మహిళా పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 45 నెలల కాలంలో రూ .2,25,330.76 కోట్లు రాష్ట్రంలోని మహిళలకు అందించినట్లు చెప్పారు. మహిళ వివక్షమీద పోరాటం చేస్తున్న ప్రభుత్వమని వివరించారు. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వమని స్పష్టం చేసారు.మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. దెందలూరు లో ఆసరా మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేసారు.
ముఖ్యమంత్రి జగన్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ 6,419 కోట్లు మూడో విడత నిధులు విడుదల చేసారు. తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,516 కోట్లు రుణాలు మాఫీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12758 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. అక్షరాల రూ.19,178 కోట్లు నేరుగా వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ అయినట్లుగా చెప్పారు. వైయస్‌ఆర్ ఆసరాగా ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలో మహిళల అభిమతానికే వదిలిపెట్టినట్లు గుర్తు చేసారు.

45 నెలల కాలంలోనే ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 9,86,616 మంది మహిళలు వివిధ రూపకాలల్లో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. వీరికి బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లు అనుసంధానం చేసామని వివరించారు. వారు వ్యాపారాల్లో నిమగ్నమవుతూ..కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించి సగటున రూ.14 వేలు ఇచ్చేవారని..ఇప్పుడు బ్యాంకుల ద్వారా సగటున ఏటా రూ.30 వేల రుణాలు ఇస్తున్నామన్నారు.
ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీలు ఉన్నాయని వివరించారు. ప్రతి అక్కచెల్లెమ్మ కూడా రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఈ రోజు దేశంలోనే ఏపీ అక్కచెల్లెమ్మలు రోల్‌మాడల్‌గా నిలిచారని అభినందించారు. ఈ విప్లవాన్ని ఇతర రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయని సీఎం వివరించారు.
జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు రూ.19,674 కోట్లు, వైయస్‌ఆర్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు, వైయస్‌ఆర్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైయస్‌ఆర్ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా రూ.22,793కోట్లు చెల్లించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మందికి రూ.9947కోట్లు, వసతి దీవెన ద్వారా 22.57 లక్షల మందికి రూ.3363 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పక్కా ఇల్లు నిర్మిస్తున్నాం..ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షల విలువ ఉంటుందన్నారు. మహిళలు రాజకీయంగా పైకి రావాలని ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications