ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి - ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ : కరోనా మార్గదర్శకాలపై సీఎం జగన్..!!
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ..ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితుల పైన జిల్లాల వారీగా సమీక్షించారు. వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని.. ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్ సెంటర్‌ను గుర్తించామని.. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.

1100 మందికి ఆస్పత్రి అవసరం
రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు.

బూస్టర్ డోసేజ్ పైన కేంద్రానికి లేఖ
ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు ఉండగా.. మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్ పూర్తి. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ చేయాలని సీఎం ఆదేశించారు. ఇక, మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.ప్రికాషన డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఆరోగ్య శ్రీ..104 సేవలు మరింత పెంచాలి
దీనివల్ల
ఫ్రంట్‌లైన్
వర్కర్లకు,
అత్యవసర
సర్వీసులు
అందిస్తున్నావారికి
ఉపయోగమని
సమావేశంలో
అభిప్రాయం
వ్యక్తం
అయింది.
ఇక,
అంతేకాకుండా
ఆస్పత్రిపాలు
కాకుండా
చాలామందిని
కోవిడ్‌నుంచి
రక్షించే
అవకాశం
ఉంటుందన్న
సమావేశంలో
నిర్ణయం
తీసుకున్నారు.
104
కాల్
సెంటర్
పటిష్ఠంగా
పని
చేయాలని
ఆదేశించారు.
కోవిడ్
పరీక్షల్లో
కేంద్రం
కొత్త
మార్గదర్శకాలపైనా
సమావేశంలో
చర్చ
జరిగింది.
ఆరోగ్య
శ్రీపై
పూర్తి
వివరాలు
తెలిపేలా
విలేజ్,
వార్డ్
క్లినిక్స్‌లో,
ప్రభుత్వ
ఆస్పత్రుల్లో
పెద్ద
హోర్డింగ్‌పెట్టాలని
సీఎం
ఆదేశించారు.
ఆరోగ్య
శ్రీ
రిఫరల్
పాయింట్‌గా
క్లినిక్స్
వ్యవహరించాలని,
వైద్యంకోసం
ఎక్కడకు
వెళ్లాలన్నదానిపై
పూర్తి
వివరాలతో
సమాచారం
లభించాలని
సీఎం
జగన్
స్పష్టం
చేసారు.