అమిత్ షా సమావేశానికి సీఎం జగన్ గైర్హాజరు - అసలు కారణం అదేనా..!!
విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలపైన మరోసారి ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మంత్రులు ..అధికారులకు దిశా నిర్దేశం చేసారు. సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఈ మేరకు అన్ని అంశాల పైన చర్చ చేయాలని డిసైడ్ అయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కావటం లేదు.

సమావేశానికి సీఎం స్థానంలో బుగ్గన
గతంలో తిరుపతి కేంద్రంగా జరిగిన ఈ సదస్సు ఈసారి కేరళలో జరగనుంది. తిరుపతిలో ఏపీ ప్రభుత్వం ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి. ఆ రోజున ఇడుపులపాయలో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్నారు. అయితే, అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరు కావటం లేదు. తన తండ్రి వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తాను ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి బుగ్గన.. సీనియర్ అధికారులు హాజరు కానున్నారు.

వైఎస్సార్ వర్దంతి వేడుకల్లో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతిపాదించిన వాటిలో 19 అంశాలను సమావేశం అజెండాలో చేర్చారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విభజన సమస్యల్ని సమావేశంలో ప్రస్తావిస్తూ, వాటికి పరిష్కారం సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలని సీఎం సూచించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా... సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు. అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు వేల్పుల నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

మూడు రోజుల కడప పర్యటన
అక్కడ వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సాయంత్రం 5 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 5.10 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.












Click it and Unblock the Notifications