ప్యాకేజీ స్టార్ లారీ ఎక్కాడు, నాలుగేళ్లకు ఒక భార్యను మార్చలేం - సీఎం జగన్ ఫైర్..!!
ముఖ్యమంత్రి జగన్ జనసేనాని పవన్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ ప్యాకేజీ స్టార్ ఓ లారీ ఎక్కాడని..దాని పేరు వారాహి అంట అని చెప్పుకొచ్చారు. ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుకొచ్చి కొడతానంటాడు..గుడ్డలూడ దీసి తంటానంటాడు.తాట తీస్తానంటాడు..మనిషికి నోటికి అదుపు లేదు..నిలకడ లేదు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు పైన సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేస్తున్న మంచి జీర్ణించుకోలేక తోడేళ్లన్నీ ఏకం అవుతన్నాయని పేర్కొన్నారు.
పవన్ వివాహాలపై జగన్ కామెంట్స్ : పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను..తీరును జగన్ తప్పు బట్టారు. కురుపాంలో ముఖ్యమంత్రి జగన్ నాలుగో విడత అమ్మ ఒడి నిధులను విడుదల చేసారు. అధికారంలో ఉన్న సమయంలో వీరంతా కలిసి పంచుకో..దాచుకో..తినుకో అంటూ బొజ్జలు పెంచుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో పడేసారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాల కాలంలో ప్రజలకు మంచి చేయని చంద్రబాబు..తోడుగా నిలుస్తున్న ప్యాకేజీ స్టార్ లారీ ఎక్కి ఊగిపోతున్నారని ఎద్దేవా చేసారు.

తాము వాళ్ల లాగా పూనకం వచ్చినట్లు ఊగుతూ మాట్లాడలేమని చె్పపారు. వాళ్లలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం ..మీసాలు మెలేయలేమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వాళ్ల లా బూతులు తిట్టలేం..నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒక సారి భార్యను మార్చలేం..పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం..వారికే పేటెంట్..అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
వాళ్ల పునాదులు అలా..మనవి ఇలా : మళ్లీ ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబు మరోసారి డ్రామాలు మొదలు పెట్టారని జగన్ ఆరోపించారు. 2014లో ఇదే తరహాలో చంద్రాబు..దత్తపుత్రుడు కలిసి హామీలు ఇచ్చారని..ఆ తరువాత అందరినీ మోసం చేసారని చెప్పుకొచ్చారు. నాడు పూచీగా సంతకం చేసిన దత్తపుత్రుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వైసీపీ పునాదులు అన్ని వర్గాల పట్ల ప్రేమ నుంచి..రైతుల మమకారం నుంచి పుట్టాయని జగన్ వివరించారు.
అవ్వాతాలు..అక్కా చెల్లెల్ల బాధ్యతల నుంచి పుట్టాయన్నారు. వారి పునాదులు మోసం చేయటంలో ఉన్నాయని..మన దగ్గరికి కూడా రావని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పేదలకు 2.23 లక్షల కోట్ల మేర మంచి చేసామని వివరించారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఇదే విధంగా పేదలకు ఎందుకు మంచి చేయలేదని ప్రశ్నించారు. తన పార్టీ పునాదులు పంచ్ డైలాగుల్లో..వెన్నుపోట్ల నుంచి రాలేదని జగన్ చెప్పుకొచ్చారు.

కార్యకర్త కాలర్ ఎగరేసేలాగానే వ్యవహార శైలి : తన ఓదార్పు యాత్ర నుంచి పార్టీ పునాదులు ప్రారంభమయ్యాయని సీఎం జగన్ చెప్పారు. 2009 నుంచి ఒక్కసారి గమనిస్తే.. జగన్ ను చూసినప్పుడు .. మా నాయకుడు అని చెప్పుకుంటూ కాలర్ ఎగరసేలానే తన వ్యవహార శైలి ఉంటుందని జగన్ స్పష్టం చేసారు. ఏనాడు అధికారం కోసం వెంపర్లాడలేదు... పొత్తుల కోసం పాకులాడలేదని జగన్ చెప్పుకొచ్చారు. ధర్మం...నిజాయితీ..ధైర్యం..పేదలకు మంచి చేయటం అనేదే తన ఫిలాసఫీ..తన పార్టీ..తన ప్రభుత్వమని జగన్ వివరించారు.
చేసిన మంచే తన బలం అని..అదే ఎన్నికల నినాదమని వెల్లడించారు. నాలుగో విడత అమ్మ ఒడి ద్వారా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు సీఎం జగన్ విడుదల చేసారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు.












Click it and Unblock the Notifications