Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నిర్ణయాలే డిఫరెంట్ : ఆమంచికి అరుదైన అవకాశం..వద్దంటున్నా: ఒక్కో దానికీ ఒక్కో లెక్క...!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర సమయం నుండి జగన్ లో మార్పు వచ్చింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ప్రకటన సమయంలో జగన్ అనుసరించిన వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ నుండి లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత బాపట్ల ఎంపీ సురేష్ ద్వారా ప్రకటన చేయించారు. అదే విధంగా అసెంబ్లీ అభ్యర్దుల జాబితాను బీసీ వర్గానికి చెందిన ధర్మాన ప్రసాద రావు ద్వారా విడుదల చేయించారు.

Recommended Video

    దమ్ముంటే విజయ సాయి రెడ్డి సెర్బియా అరెస్ట్ పై ట్వీట్ చేయాలి

    ఇక, తన కేబినెట్ కూర్పు విషయంలో అనూహ్య సమీకరణాలతో 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసారు. ఇక, ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నేతలు మొత్తం గా షాక్ తిన్నారు. ఇంతకీ జగన్ ఏం చేసారు..పార్టీ కార్యాలయం ఎవరు ప్రారంభించారు..

     ఆమంచికి అరుదైన అవకాశం ఇచ్చిన జగన్..

    ఆమంచికి అరుదైన అవకాశం ఇచ్చిన జగన్..

    ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీ లో చేరిన ఆమంచి తాజా ఎన్నికల్లో చీరాల నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరిన సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ఆమంచి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమంచికి స్పష్టమైన హామీ వచ్చింది. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన భాదపడాల్సిన అవసరం లేదని..పార్టీలో సరైన గుర్తింపు ఉంటుంద ని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు ఆమంచికి ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టం కాలేదు. ఇక, తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం చేయటానికి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన పార్టీ నేతలకు అభివాదం చేస్తూ వైయస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ తరువాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం రిబ్బన్ కట్ చేయటానికి చేరుకున్నారు. అక్కడే ఎంపీ సురేష్..ఆమంచి క్రిష్ట మోహన్ సైతం అక్కడే ఉన్నారు. అంతే..వెంటనే జగన్ తన చేతిలో ఉన్న కత్తెర ను ఆమంచికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయాలని సూచించారు. ఆమంచి క్రిష్ట మోహన్ అధినేతగా మీరు చేయాల్సింది..నేను కాదు అంటూ వారించారు. జగన్ మాత్రం వినలేదు. తానే స్వయంగా ఆమంచి చేతులను పట్టుకొని..తన చేతులు కలిపి రిబ్బన్ కట్ చేసారు. అదే సమయంలో ఎంపీ సురేష్ సైతం చేయి కలిపారు.

    ఆమంచికి ప్రాధాన్యత ఎందుకంటే..

    ఆమంచికి ప్రాధాన్యత ఎందుకంటే..

    చీరాల నుండి ఓడినా ఆమంచి క్రిష్ట మోహన్ ను సీఎం జగన్ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఓడినా..ఆమంచి ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా చేయగలరనే పేరు ఉంది. అదే విధంగా తన సామాజిక వర్గపు నేతలతో తన జిల్లాలోనే కాకుండా గోదావరి జిల్లా నేతలతోనూ సన్నిహిత సంబందాలు ఉన్నాయి. ఎన్నికల వేళ..తూర్పు గోదావరి కి చెందిన ప్రముఖ కాపు నేతను టీడీపీ నుండి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆమంచి ప్రయత్నించారు. అయితే, టిక్కెట్ ఖరారు విషయంలో నియోజకవర్గ మార్పుకు అంగీకారం కుదరకపోవటంతో ఆయన రాక ఆగిపోయింది. ఇక, త్వరలో స్థానిక సంస్థలు...మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాలుగు సీట్లు సాధించింది. జిల్లాలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేలా ముఖ్యమంత్రి జగన్ ఆ బాధ్యతలను ఆమంచి కి ఇవ్వాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఆమంచికి ఎమ్మెల్సీ లేదా కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆమంచి సైతం తనకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలు కనిపిస్తే..తిరిగి కేడర్ లో ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. దీంతో..త్వరలోనే ఆమంచికి సంబంధించి నిర్ణయం తీసుకొనే అవకావం కనిపిస్తోంది.

     కొత్త హంగులతో పార్టీ కేంద్ర కార్యాలయం..

    కొత్త హంగులతో పార్టీ కేంద్ర కార్యాలయం..

    తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. హాజరయ్యారు. ఈ కార్యాలయంలో ఐటీవింగ్, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసేందుకు వీలుగా పార్టీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మూడు అంతస్తుల్లో పార్టీ కార్యాలయం నిర్మించారు. మొదటి ఫ్లోర్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ ఫ్లోర్‌లో పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయనున్నాయి. మూడవ ఫ్లోర్‌‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యకలాపాలు.. ఇక నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సైతం వారంలో ఒక రోజు ఇక్కడ పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+