దేవుడిదయతో మరో మంచిపని.. మీకెందుకు కడుపుమంట; సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభంలో సీఎం జగన్‌

రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని, నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని పేర్కొన్నారు. తన పుట్టిన రోజున దాదాపు 50 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు జగన్. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఓటిఎస్ లేకుండా మార్కెట్ రేట్లకు కొంటారా?


సొంతింటి కోసం ప్రతి నిరుపేద జీవితకాలం కృషి చేస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇల్లంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదని, సొంతింటి కోసం వారు సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలం అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల సొంతింటిని నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అని అడగాలి అంటూ జగన్ పేర్కొన్నారు. మా ఇళ్లను ఓటిఎస్ లేకుండా మార్కెట్ రేట్లకు కొంటారా అని అడగండి అంటూ జగన్ ఓటిఎస్ వద్దన్న ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు.

ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట, వారిని ప్రశ్నించండి


ప్రతి ఒక్కరూ మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలను ఐదుసార్లు పంపినా ఏదో ఒక వంకతో వెనక్కి పంపిన పెద్దమనిషి చంద్రబాబు అని మండిపడ్డారు. రుణమాఫీ కాదు కదా వడ్డీ మాఫీ కూడా చేయను అన్న పెద్దమనుషులు మీరు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం

చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నాం

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేరుస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 15. 60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంటి పై సర్వ హక్కుల కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని పేర్కొన్న జగన్ ఈ పథకం కింద నిరుపేద ప్రజలకు లబ్ధి జరుగుతుందన్నారు. దాదాపు 10 వేల కోట్ల రుణమాఫీ, 6 వేల కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చార్జీల మినహాయింపు జరుగుతుందని వెల్లడించారు.

దేవుడి దయతో మరో మంచి పనికి శ్రీకారం చుడుతున్నా

దేవుడి దయతో మరో మంచి పనికి శ్రీకారం చుడుతున్నా


52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటుందని జగన్ పేర్కొన్నారు. సొంత ఇల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని తెలిపిన జగన్ ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి డాక్యుమెంట్లు అందజేస్తున్నామని కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని వెల్లడించారు. ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చని వివాద రహిత ఆస్తిగా మార్చి డాక్యుమెంట్లు ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. దేవుడి దయతో మరో మంచి పనికి శ్రీకారం చుడుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఉగాది వరకు ఓటీఎస్ పొడిగిస్తున్నట్టు జగన్ ప్రకటన

ఉగాది వరకు ఓటీఎస్ పొడిగిస్తున్నట్టు జగన్ ప్రకటన

నిరుపేదలు తమ సొంత ఇంటిని అవసరాల కోసం కూడా వినియోగించుకోవచ్చని, తనఖా పెట్టుకోవచ్చని, బాగా డబ్బు అవసరమైతే అమ్ముకోవచ్చని జగన్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నామని అందుకే దీన్ని ఉగాది వరకు పొడిగిస్తున్నామంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. పేదల కోసం ఇంతగా మంచి పనులు చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ చంద్రబాబు ను విమర్శించారు.

నిరుపేదలకు ఓటీఎస్ వరం .. సద్వినియోగం చేసుకోమన్న జగన్

నిరుపేదలకు ఓటీఎస్ వరం .. సద్వినియోగం చేసుకోమన్న జగన్


తాము పరిపాలన చేపట్టిన 30 నెలల కాలంలో ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా లక్షా 16 వేల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలోకి జమ చేస్తామని జగన్ పేర్కొన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా ఈ నగదు బదిలీ జరిగిందని జగన్ తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ కు పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దానివల్ల ఇంటిపై సర్వహక్కులు లభించడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ఖర్చుల భారం కూడా తగ్గుతుందని జగన్ లబ్ధిదారులకు వివరించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందించి ఈ పథకాన్ని నిరుపేదలైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+