విజయవాడ కేంద్రంగా కీలక ఘట్టం - సీఎం జగన్ హాజరు..!!
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అరుదైన ఘట్టానికి విజయవాడ వేదిక అవుతోంది. రాష్ట్రంలో ఎప్పుడూ చేయని విధంగా ఆరు రోజుల పాటు నిర్వహించే మహాయజ్ఞం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు.
రాజశ్యామల యాగం:రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ వెల్లడించారు. ఇవాళ్టి నుండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యజ్ఞం జరగనుంది. సాయంత్రం ఆరు గంటల నుండి స్తోత్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది.

ఆరు రోజుల పాటు నిర్వహణ:విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు. మొత్తం ఆరు రోజుల పాటు ఈ యాగ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యా గాన్ని 108 కుండాలు, నాలుగు ఆగమనాలు, 500 మంది రుత్వికులతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టారు.
సీఎం జగన్ హాజరు:ఆరు రోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత, శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చేస్తున్నారు. మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు జగన్ ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి వస్తున్నారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో దేవాదాయశాఖ ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఎండాకాలంలో జరుగుతున్న ఈ యాగానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో జరిగే ఈ యాగం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications