ముహూర్తం ఫిక్స్, అఫీషియల్ - సీఎం జగన్ సిద్దం..!!

ఎన్నికల వేళ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖ నుంచి పాలనకు సీఎం సిద్దమయ్యారు. ఇప్పటికే దీని పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సీఎం..ఇక నుంచి వారంలో రెండు రోజులు విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దసరా నుంచి పాలన ప్రారంభానికి ముమూర్తం అధికారికంగా ఖరారైంది. దీంతో, సీఎం క్యాంపు కార్యాలయంతో పాటుగా మంత్రులు..అధికారుల కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విశాఖ నుంచి పాలన: విశాఖ నుంచి పాలనకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటి వరకు దసరా నుంచి అని చెబుతున్నా..ఇప్పుడు అధికారికంగా నిర్దారించారు. అక్టోబర్ 23న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి గృహ ప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైంది. 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు.

CM Jagan to begin his Administration in Vizag from October 24, officials making arrangements

విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ నిర్మిస్తున్న కాంప్లెక్స్‌లోనే సీఎం నివాసం ఉండనున్నట్లు సమాచారం. సీఎం విశాఖ పాలనపై ఎంపీ విజసాయిరెడ్డి సైతం తాజాగా స్పందించారు. ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలు విశాఖ కేంద్రంగానే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వ్యవహారాలు అమరావతిలో కొనసాగనున్నాయి.

తుది కసరత్తు: సీఎంఓ విశాఖ నుంచి పని చేసినా..సచివాలయం మాత్రం అమరావతితోనే కొనసాగనుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఈ నెల 15-20 తేదీల్లో పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకోవటంతో పాటుగా అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు..అవసరమైన చోట కొన్ని ఇళ్లను అందుబాటులోకి తెస్తున్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో ఇప్పటికే కొన్ని ఇళ్లకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార యంత్రాగానికి సూచనలు చేసారు. త్వరలోనే విశాఖలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

CM Jagan to begin his Administration in Vizag from October 24, officials making arrangements

రాజకీయంగా కీలకం: సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్, దర్వాజాలు, ఇతర ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నాయని తెలుస్తోంది. విశాఖ నగరంలో రోడ్ల అనుసంధానం పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే విశాఖలో కొత్త మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. దసరా నుంచి దాదాపుగా ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.

మేనిఫెస్టోల ప్రకటన..అభ్యర్దుల ఖరారు పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఇక, విశాఖ నుంచి పాలన చేయటం ద్వారా రాజకీయంగా తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ..ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+