ఎన్నికల వేళ సీఎం జగన్ మరో కీలక అడుగు..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎంతో కాలంగా ఏపీ ప్రజల డిమాండ్లను నెరవేర్చే పనులపైన ఫోకస్ పెట్టారు. రేపు (సోమవారం) ముఖ్యమంత్రి జగన్ మచిలీపట్నం లో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించనున్నారు.

బందరుపోర్టు కు శంకుస్థాపన : ముఖ్యమంత్రి జగన్ బందరుపోర్టు కు శంకుస్థాపన చేయనున్నారు. రేపు (22న) ముఖ్యమంత్రి జగన్ మచిలీపట్నం పర్యటనలో భాగంగా ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హెలీకాప్టర్‌లో 9 గంటలకు బందరుమండలం తపసిపూడికి చేరుకుంటారు.9.20గంటలకు పోర్టు పనుల ప్రారంభ పూజలు చేస్తారు. 9.45కు పోర్టు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

 jagan9

9.55కు తపసిపూడి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 10.05కు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి 10.15 గంటలకు రోడ్డుమార్గం ద్వారా చిలకలపూడిలోని భారత్‌స్కౌట్స్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 10.30 ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. అక్కడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, జ్యోతిప్రజ్వలన చేస్తారు. 11 గంటవరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడి.. 11.30వరకు ముఖ్యమంత్రి ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది.

మచిలీపట్నం అభ్యర్ధిపై నిర్ణయం : మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సీఎం పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ మచిలీపట్నంలోనే జరిగింది. గత ఎన్నికల్లో క్రిష్ణా జిల్లాలో రెండు సీట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది. వైసీపీ ఇప్పుడు తిరిగి తమ సీట్లను నిలబెట్టుకోవటనానికి ప్రయత్నం చేస్తోంది.

 jagan9

వచ్చే ఎన్నికలో మచిలీపట్నం నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్ధిని సీఎం జగన్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని నాని కోరగా, తొలుత సీఎం తోసిపుచ్చారు. నియోజకవర్గంలో ఇప్పుడు పేర్ని నాని యాక్టివ్ అయ్యారు. సీఎం పాల్గొనే సభలో పేర్ని నాని కుమారుడిని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయంగా ఆసక్తి : బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని గతంలోనే అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. దీంతో క్యాబినేట్ సమావేశంలో రుణం తీసుకునే అంశం పై చర్చించారు. రుణం పొందేందుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోర్టుతో పాటుగా పలు మౌళిక వసతుల కల్పనకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాజకీయంగా సీఎం జగన్ చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+