Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో కీలక పరిణామం- సీఎం జగన్ ఆప్షన్ కే మొగ్గు..!!

అమరావతి కేంద్రంగా సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా దాదాపు 50 వేల మందికి ఇంటి స్థలాల పంపిణీ ఇప్పటికే ప్రారంభించారు. సీఆర్డీఏ పరిధిలోని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు సొంత ఇంటి కల సాకార చేసేలా ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం వేళ అమరావతిలో తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెల్లడించింది.

అమరావతిలో ప్రభుత్వం 50,793 మందికి నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలాలను అంద చేసింది. ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలను ప్రారంభించేలా హౌసింగ్ శాఖ చర్యలు ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లే అవుట్లలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది..ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి నిర్మాణాల విషయంలో మూడు ఆప్షన్లు ఇచ్చింది. అందులో భాగంగా 88.79 శాతం మంది లబ్దిదారులు ఆప్షన్ -3 కి మొగ్గు చూపారు. వీరి కోసం వైఎస్సార్ జన్మదినం నాడు జూలై 8న ఇంటి నిర్మాణ శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కార్యక్రమం ఖరారు అయింది.

jagan16

ఈ ఆప్షన్ ద్వారా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలువనుంది. ఒక్కో యూనిట్ కు బిల్లుల రూపలో రూ 1.80 లక్షలు..పావలా వడ్డీకి రూ 35 వేలు బ్యాంకు రుణంగా సమకూర్చి రూ 2.15 లక్షల చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతో పాటుగా సబ్సిడీ పై స్టీల్, సిమెంట్ లాంటి 14 రకాల నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ రూ 54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తోంది. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మంది వరకూ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. 21.25 లక్షల ఇళ్ళ నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

అమరావతి పరిధిలో మెజార్టీ లబ్ది దారులు ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లబ్దిదారులను గ్రూపులుగా ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణాలను జూలై 8న శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్మాణాలకు వీలుగా కేంద్రం నుంచి అనుమతులు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి శంకస్థాపన తరువాత వేగంగా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+