ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధానితో భేటీ : పొత్తుల అంశం పై క్లారీటీ..!!

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసారు. ఆ సమయంలోనే మరోసారి ప్రత్యేకంగా కలవాలని ..ప్రధానితో చెప్పారు. దీంతో..సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి జగన్ కొత్తగా రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు.

ప్రధానితో కీలక అంశాలపై

ప్రధానితో కీలక అంశాలపై

రాస్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చింది. మర్ము అమరావతికి వచ్చిన సమయంలో.. సీఎం జగన్ తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేసి..ముర్మును సత్కరించారు. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో నూతన రాష్ట్రపతితో సమావేశం అవుతారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ధన్ కర్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది.

మంగళవారం సాయంత్రం ప్రధానితో సీఎం జగన్ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీతో సమావేశం లో ఈ సారి సీఎం జగన్ కీలక అంశాల పైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్య..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ... సవరించిన అంచనాలకు ఆమోదం పైన ప్రధానికి వివరించనున్నారు.

రాజకీయ పరిణామాలపై చర్చ

రాజకీయ పరిణామాలపై చర్చ

దీంతో పాటుగా.. రాజకీయ అంశాల పైన ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ- చంద్రబాబు పలకరింపులు ఆ తరువాత ప్రచారంలోకి వచ్చిన అంశాల పైన ఇప్పుడు బీజేపీలో చర్చ సాగుతోంది. దీంతో పాటుగా ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా.. చంద్రబాబుకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

పొత్తుల వ్యవహారం పై క్లారిటీ

పొత్తుల వ్యవహారం పై క్లారిటీ

దీంతో..ఏపీ పొత్తు రాజకీయాల పైన ఈ పర్యటనలో సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి క్లారిటీ తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయంగా ఏపీలో సీఎం జగన్ ఇక వేగంగా అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారు. రాజకీయ నిర్ణయాల దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వంతో ఉన్న సంబంధాలు - సాన్నిహిత్యం తో రాజకీయ అంశాల పైన పూర్తి క్లారిటీతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+