విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్ - విద్యాదీవెన నిధుల జమకు నిర్ణయం..!!
ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలు కొనసాగిస్తున్నారు. ఈ నెల, వచ్చే నెల వరుసగా సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న జగనన్న విద్యా దీవెన నిధులను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. వచ్చే నెల జనవరిలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపుతో పాటుగా వైఎస్సార్ ఆసరా..వైఎస్సార్ భరోసా నిధులు విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. విద్యా దీవెన లబ్దిదారుల జాబితాను విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది.

జగనన్న విద్యా దీవెన కింద ప్రతీ మూడు నెలలకు ఒకసారి విద్యార్దుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. గత వారంలోనే ఈ నిధుల జమ కావాల్సి ఉన్నా..వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 19న విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. గత నెలలో ప్రభుత్వం నుంచి ఈ పథకం నిధుల విడుదలకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్ది - తల్లి సంయుక్త ఖాతా ఉండాలని నిబంధన పెట్టింది. ఆ తరువాత వచ్చే విడత నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తొలి నుంచి అమలు చేస్తున్న పథకాల అమలును వేగవంతం చేసింది. అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి బహిరంగ లో ప్రసంగించనున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications