మహిళల ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున జమ చేయనున్న సీఎం జగన్..!!
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిధులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22న వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా నిడుదవోలును ఎంచుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది దాదాపు 35 లక్షల మంది మహిళలకు లబ్ది జరగనుంది.
కాపు నేస్తం నిధులు విడుదల: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తోంది. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం మహిళలకు ఇస్తోంది. ఈ నెల 22న కాపు నేస్తం పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. తొలి రెండు విడతల్లో రూ 490 కోట్లు చొప్పున, మూడో విడతలో 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు సీఎం జగన్ జమ చేసారు. కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశారు.
నిడుదోలు కేంద్రంగా అమలు: మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తోంది. తాజాగా నిర్వహించిన జగన్న సురక్ష ద్వారా అర్హత ఉంది పథకం అందని లబ్దిదారులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవరత్నాల్లో పథకాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 50 నెలల కాలంలో రూ 2.45 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి మేలు జరిగింది. ఇప్పుడు వరుసగా నాలుగో ఏడాది నిధులను రాజకీయంగా కీలకమైన గోదావరి జిల్లా నుంచి సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ఒక్కో లబ్దిదారుకు రూ 15 వేలు: కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000/- వేల లోపు ఆదాయం ఉండాలి. కాపు నేస్తానికి సంబంధించి కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి.. మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు.
ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ నిడుదవోలు కేంద్రంగా కాపునేస్తం నిధుల విడుదల..బహిరంగ సభలో చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications