సీఎం జగన్ గుడ్ న్యూస్, తల్లుల ఖాతాల్లోకి నిధులు - అర్హుల జాబితా సిద్దం

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు. మరో అయిదు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో రాకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంక్షేమ ఓట్ బ్యాంకు ను నమ్ముకున్న జగన్ పార్టీ శ్రేణులను ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. ఇక, సంక్షేమ పథకాల క్యాలెండర్ ను యథావిధిగా అమలు చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా డిసెంబర్ 12న విద్యా దీవెన నిధుల విడుదల

తల్లుల ఖాతాల్లో నిధులు
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

CM Jagan to Release vidhyadevena funds on 12th December at Bhimavaram

పిల్లల చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ఇక విద్యారంగలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇక, ఈ సారి సీఎం జగన్ భీమవరం వేదికగా నిధుల విడుదలకు నిర్ణయించారు.

భీమవరం వేదికగా
అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్ తో ఒప్పందం లాంటివి అమలు చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం ద్వారా ఆర్థిక‌ సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. ఇక, వరుసగా ఈ మూడు నెలల కాలంలో సంక్షేమ పథకాల అమలుకు షెడ్యూల్ ఖరారు చేసారు.

అర్హుల జాబితా సిద్దం
మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జ‌గ‌న్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 12న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

తొలుత ఈ సారి నిధుల విడుదలకు సంబంధించి విద్యార్ధి- తల్లి బ్యాంకుల్లో సంయుక్త ఖాతా పైన నిర్ణయం తీసుకున్నా..ఆ తరువాత వచ్చే విడత నుంచి అమలుకు నిర్ణయించారు. దీంతో, అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించారు. ఇక..భీమవరం నుంచి నిధుల విడుదల..బహిరంగ సభలో జగన్ ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో జగన్ పర్యటన కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+