రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్ నిధుల విడుదల..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాను అమలు చేస్తున్న సంక్షేమం మరోసారి తనకు అధికారం ఇస్తుందనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు. సంక్షేమ క్యాలెండర్ ను అమలు చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి వరకు పథకాల అమలుకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి పుట్టపర్తి కేంద్రంగా వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధుల విడుదలకు నిర్ణయించారు.
ఈ నెల 7న విడుదల:ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7వ తేదీన రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులు విడుదల చేయునున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైతులకు ఏటా రూ.7,500 పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో అందజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 50నెలల్లో రాష్ట్రంలోని 52.50లక్షల మందికి 31వేల కోట్ల రుపాయలను పిఎం కిసాన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించారు. రైతు భరోసాతో బయట అప్పులు చేయాల్సిన అవసరం రైతులకు రాదని చెప్పారు.రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండే పరిస్థితి రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

70 శాతం మంది రైతులకు మేలు:పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో అర హెక్టారులోపు 1.25ఎకరాల్లోపు ఉన్న రైతులు 60శాతం మంది ఉన్నారు. రైతుల్లొ రెండున్నర ఎకరాల్లోపు ఉన్న వారు 70శాతం వరకు ఉన్నారు. రూ.13,500 పెట్టుబడి సాయం అరవై శాతం రైతులకు 80శాతం పంటలకు 80శాతం పెట్టుబడి సహాయంగా ఉపయోగ పడుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండే పరిస్థితి రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందని వివరించారు.
రైతులకు అండగా:ప్రతి గామంలో గతంలో లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను ఏర్పాట్లు చేశామని 10,778ఆర్బీకేలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు, కియోస్క్‌ల ద్వారా కల్తీ లేని విత్తనాలు అందిస్తున్నామని, ఈ క్రాప్ నమోదు చేసి ఏ ఎకరాలో ఏ పంట వేశారనేది కూడా నమోదు చేస్తున్నామన్నారు. సోషల్ ఆడిట్‌లో జాబితాలు మొత్తం ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్‌ఫుట్ సబ్సిడీల్లో కూడా ఇలాంటి మంచి జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులతో కలిపి రైతులందరికి అందిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications