మేనల్లుడి నిశ్చితార్ధానికి జగన్ - టీడీపీ నేతలు, సినీ ప్రముఖుల హాజరు..!!
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం కు ప్రముఖులు హాజరు కానున్నారు. షర్మిల తనయుడు నిశ్చితార్దం ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ ఇందుకు వేదిక కానుంది. తన మేనల్లుడు నిశ్చితార్ధానికి సీఎం జగన్ సతీ సమేతంగా హాజరవుతున్నారు. రాజకీయాలకతీతంగా టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ నేతలతో పాటుగా సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి - అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. తన కుమారుడు నిశ్చితార్ధ వేడుకకు హాజరు కావాలని షర్మిల రాజకీయాలతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ , మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు రాజకీయ - సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ రోజు జరిగే ఎంగేజ్ మెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటుగా ఇతర పార్టీల నేతలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరవుతారని సమాచారం. పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, సినీ రంగం నుంచి ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తిని పెంచుతోంది. 2024 ఫిబ్రవరి 17న రాజారెడ్డి- అట్లూరి ప్రియ వివాహం జోధ్ పూర్ లో జరగనుంది. తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసిప్షెన్ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఏపీలో ఎన్నికల వేళ మారుతున్న రాజకీయ సమీకరణాలతో షర్మిల ఇంట వేడకకు ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications