ప్రధానితో సీఎం జగన్ భేటీ, పొత్తుల వేళ కొత్త రాజకీయం - వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల సమయంలో కొత్త రాజకీయం మొదలైంది. అధికారం నిలబెట్టుకొనే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు దిశగా మంత్రాంగం ప్రారంభించారు. చంద్రబాబు తాజాగా అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇప్పుడు పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది. హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
ఢిల్లీకి సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఖాయమైనట్లు తెలుస్తోంది. రేపు (శక్రవారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం టీడీపీ తో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయి. జగన్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరటం పైన దాదాపు నిర్ణయం తీసుకున్నారు.

మారుతున్న సమీకరణాలు
ఒకటి, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేస్తే కేంద్రం రీయంబర్స్ చేస్తుందని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకవాత్ తోనూ సమావేశం కానున్నారు. ఈ నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావాల్సిన పలు అంశాల పైన కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
జగన్ ఒంటరి పోరు
ఇటు ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తుల పైన కీలక మంత్రాంగం జరుగుతోంది. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకుపోయేలా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరశఖం పూరించిన సీఎం జగన్ ఇప్పుడ ఎన్నికల వేళ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications