CM Jagan: వరద ప్రభావిత గ్రామాల్లో రెండో రోజు పర్యటించనున్న జగన్..
సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో జగన్ పర్యటించారు. మంగళవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికి వరదల వల్ల సంభవించిన నష్టానికి పరిహారం చెల్లించింది ప్రభుత్వం. వరదల వచ్చిన వెంటనే పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని జగన్ గతంలోనే చెప్పారు. అందుకే అందరికీ సాయం అందక పర్యటిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న సాయంత్రం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం హెలికాప్టర్ లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. రాత్రికి ఆర్అండ్ బీ గెస్ట హౌస్ సీఎం జగన్ బస చేశారు. ఈ సందర్భంగా జగన్ తో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. జగన్ గెస్ట్ హౌస్ వెళ్తున్న క్రమంలో పలువురిని పలకరించారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇద్దరు బాధితులు సీఎంను కలిశారు. వెంటనే స్పందించిన జగన్ కలెక్టర్ మాధవిలతో మాట్లాడి.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఇచ్చారు.

మంగళవారం సీఎం జగన్ ఉదయం 9 గంటలకు అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. హెలికాప్టర్ లో గురజపులంక చేరుకుంటారు. అక్కడ వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో మాట్లాడాతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. ఉదయం 10: 30 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం రామాలయపేటకు రోడ్డు మార్గంలో చేరుకుని అక్కడ వరద బాధితులతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. 11:50 గంటలకు తిరిగి రోడ్డు మార్గంలో గురజపు లంకకు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లికి హెలికాప్టర్ లో వెళ్తారు.
సోమవారం వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్ల జగన్ చెప్పారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ను ముందుగానే అలెర్ట్ చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications