వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నుల ఆదాయం తగ్గింది -జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది : బ్యాంకర్లు సహకరించాలి : సీఎం జగన్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో ప్రభుత్వ రెవిన్యూ- పన్ను వసూళ్ల గురించి ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక పరిస్థితిని..బ్యాంకర్లు సహకరించాల్సిన రంగాల పురోగతిని వివరించారు. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019-20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందన్నారు. 2020-21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగిందని వివరించారు.

Anasuya Bharadwaj :చీరలో కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ.. బ్యూటీఫుల్ ఫొటోస్

జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది

జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది

దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందన్నారు. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందని... ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందని చెప్పుకొచ్చారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైందని విశ్లేషించారు. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందన్నారు.

జాన్వీ కపూర్ సెక్సీ పోజులు.. టాప్ టూ బాటమ్ అదిరింది!

కౌలు రైతులకు మేలు చేయండి

అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇవ్వటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయని వివరించారు. ఇప్పటికే బ్యాంకర్లు 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్‌ చేసి అక్కడ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించామన్నారు.

కడపలో పూర్తిగా డిజిటలైజేషన్

అంతే కాకుండా.. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను పెట్టడం పైన సీఎం ప్రశంసించారు. బ్యాంకింగ్‌ విషయంలో వైయస్సార్‌ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తిచేశామన్నారు.సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చామని సీఎం చెప్పారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యిందని వివరించారు.

హౌసింగ్ లబ్ది దారులకు రుణాలివ్వండి

హౌసింగ్ లబ్ది దారులకు రుణాలివ్వండి

మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని... ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4-5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలని కోరారు. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని చెప్పారు. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని... దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని సీఎం బ్యాంకర్లను కోరారు.

బ్యాంకర్ల సహకారం కోరిన సీఎం జగన్

బ్యాంకర్ల సహకారం కోరిన సీఎం జగన్

ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారని సీఎం చెప్పారు. అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగేలా బ్యాంకులు దృష్టిసారించాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆర్దిక మంత్రి బుగ్గన..సీఎస్ దాస్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పదకాలు..బ్యాంకుల తోడ్పాటు గురించి వివరించారు.

English summary
CM Jagan seek support of bankers to benefit housing beneficiaries in housing project. CM revelaed the state taxes collection and GDP rate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X