భారత్ లో గోల్డ్ బ్యాన్..?? సంచలన ప్రకటన దిశగా కేంద్రం..??
భారతీయులకు ముఖ్యంగా బంగారం అంటే చాలా ఎమోషన్ ఉంటుంది. పెళ్లి లేదా ఇతర ఏ ఫంక్షన్ అయినా ఒంటి నిండా నగలతో వెళ్లాలని చాలామంది మహిళలు కలలు కంటూ ఉంటారు. కానీ దేశంలో బంగారం ధరలు చూస్తే మతి పోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.1,53,000 పైమాటే ఉంది. దాంతో ఈ రోజుల్లో బంగారం కొనాలంటేనే గుండెలు అదిరిపోతున్నాయి. ఇక ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం కొనకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక చేసేదేంలేక లక్షల ఖర్చు చేసి మరీ బంగారం కొనేస్తున్నారు భారతీయులు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, దేశంలో వేగంగా మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు.
సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా భారతీయులందరూ కనీసం ఓ ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను ఆపివేయాలని లేదా తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పటికీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని ఆయన కీలక సూచనలు చేశారు. మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ లో పూర్తిగా గోల్డ్ బ్యాన్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అయితే కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రభుత్వం నేరుగా బంగారంపై నిషేధం విధించడం కంటే ప్రజలు స్వచ్చందంగా బంగారం కొనుగోలును తగ్గించుకోవాలని కోరుతోంది.

ఒకవేళ బంగారం దిగుమతులు తగ్గకపోతే ప్రభుత్వం భవిష్యత్తులో దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఫిజికల్ గా బంగారం కొనడం కాకుండా డిజిటల్ గోల్డ్ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత జ్యువెలరీ షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీగా పడిపోయాయి. ఇక ప్రస్తుతం బంగారం కొనడం చట్టరిత్యా నేరం కాదు. కానీ దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బంగారం వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. అయితే భవిష్యత్తులో దిగుమతులపై మరిన్ని ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది.. కానీ పూర్తి నిషేధం అనేది దాదాపు సాధ్యం కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications