థియేటర్లలో రూ. 1800 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి ఇండస్ట్రీ హిట్ సినిమా..

దేశభక్తి సినిమాలకు భారత్ లో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. దేశభక్తి నేపథ్యంలో ఇప్పటికే రిలీజైన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. గతేడాది ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. లైఫ్ టైమ్ లో దాదాపు రూ. 1400 కలెక్షన్స్ ను రాబట్టింది. ఆ తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన మూవీ ధురంధర్ 2 ది రివెంజ్. ఈ మూవీ మార్చి 19 న రిలీజైంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. భారత్ లో ఏకంగా 1,177 కోట్ల వసూల్లు సాధించింది. ధురంధర్ 2 మూవీ రిలీజైన కేవలం 18 రోజుల్లోనే రూ. 1000 కోట్ల నెట్ వసూల్లు రాబట్టింది. రూ. 225 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు ఏకంగా 450 శాతం లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రణ్ వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు.

Dhurandhar2 The Revenge Heads to Netflix Movie to Start Streaming from May 14th Dhurandhar 2

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. భారత్ లో ఈ మూవీ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. ఈ మూవీ మే 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ థియేటర్ వెర్షన్ కంటే సుమారు 3 నిమిషాలు ఎక్కువ నిడివి కలిగి ఉంది. మొత్తం రన్ టైమ్ 3 గంటల 52 నిమిషాలుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+