TG Traffic Challan: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై బిగ్‌ అప్‌డేట్..!

రాష్ట్రంలోని వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ చలాన్‌ ల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేందుకు రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ట్రాఫిక్ చలాన్‌ ల సమాచారం నేరుగా మీ మొబైల్‌ కు రావాలంటే.. వాహనదారులు తప్పకుండా తమ వ్యక్తిగత వివరాలను అప్‌ డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు.

"మీ వాహన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, సకాలంలో తెలుసుకోవడానికి.. వెంటనే VAHAN పోర్టల్‌ లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌ డేట్ చేసుకోండి.

కాంటాక్ట్ వివరాలను అప్ డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే జరిమానాల భారం నుంచి తప్పుకోవచ్చు. వాహనదారులు తమ వివరాలను http://vahan.parivahan.gov.in పోర్టల్ ద్వారా లేదా ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా, వేగంగా ఆప్ డేట్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌ లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే పరిగణిస్తారు. కాబట్టి అలసత్వం వహించకుండా నేడే మీ వివరాలను అప్‌ డేట్ చేసుకోండి. సమాచారం తెలుసుకుంటూ జరిమానాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి" అని సీపీ సజ్జనార్ తన పోస్టులో ప్రస్తావించారు.

Hyderabad Police Advisory Update Mobile amp amp Email on VAHAN Portal to Receive Traffic E-Challans Hyd

అలాగే హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న హింస, సైబర్ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు, పోలీసింగ్‌ లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్టు సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను పోలీస్ మెంటార్ గా నియమించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే మహిళలు తమ సమస్యలను భయం లేకుండా.. మరింత స్వేచ్ఛగా వెల్లడించేందుకు స్పందన - ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+