విజయ్ రాకపై స్టాలిన్ ట్వీట్..! ఆ సలహా ఇచ్చా..!

తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Mk stalin) ఇంటికి వెళ్లారు. విజయ్ వస్తానని ఫోన్ చేయడంలో స్టాలిన్ కూడా ఆహ్వానించారు. దీంతో విజయ్ ఆయన్ను వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఇంట్లోకి విజయ్ రాగానే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పలకరింపున తర్వాత విజయ్-స్టాలిన్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విజయ్ వెళ్లిపోయారు.

Vijay vs Stalin: విజయ్-స్టాలిన్ లో ఎవరు కరెక్టో చెప్పేసిన ఆర్బీఐ..!
Vijay vs Stalin: విజయ్-స్టాలిన్ లో ఎవరు కరెక్టో చెప్పేసిన ఆర్బీఐ..!

విజయ్ తన నివాసానికి వచ్చి వెళ్లిపోయాక స్టాలిన్ దీనిపై స్పందిస్తూ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన .. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ నన్ను రాజకీయ మర్యాదతో కలుసుకుని, నా శుభాకాంక్షలు స్వీకరించారని తెలిపారు. ఆలాగే తాను ఆయనకు హృదయపూర్వక అభినందనలతో పాటు తన సలహాను కూడా అందించానని స్టాలిన్ వెల్లడించారు. అయితే విజయ్ కు స్టాలిన్ ఇచ్చిన సలహా ఏంటో మాత్రం వెల్లడించలేదు.

MK Stalin Tweets After CM Vijay s Courtesy Call Congratulations Greetings and a Word of Advice

విజయ్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..! కీలక వ్యాఖ్యలు..!
విజయ్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..! కీలక వ్యాఖ్యలు..!

దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ తెరవెనుక సహకరించారనే ప్రచారం ఇప్పటికే తమిళనాడులో సాగుతోంది. డీఎంకే కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ .. గంప గుత్తగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినా స్టాలిన్ ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఒక్క కాంగ్రెస్ విషయంలో మాత్రమే తమకు చెప్పకుండా విజయ్ పంచన చేరిందని ఆక్షేపించిన స్టాలిన్.. మిగతా మిత్రులకు మాత్రం చెప్పే వెళ్లారంటూ ట్వీట్లు పెట్టారు. దీంతో విజయ్ వద్దకు తన కూటమి మిత్రుల్ని పంపింది స్టాలినే అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో విజయ్ కు స్టాలిన్ ఇచ్చిన సలహా ఏంటన్న చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+