వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియాకు రూ.కోటి చెక్కు అందించిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రూ. కోటి నజరానాను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బహూకరించారు. టెన్నిస్‌లో మరింత ప్రతిభా పాటవాలు ప్రదర్శిచేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరాన చెక్కును ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సానియాకు అందజేశారు.

నగరంలోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశం సందర్భంగా కెసిఆర్‌ ఈ చెక్కును అందజేశారు. సానియా మీర్జా తెలంగాణ బిడ్డ కావడం వల్లే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టెన్నిస్ ప్రపంచంలో సానియా నెంబర్ వన్‌గా నిలవాలని ఆయన అభిలాషించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సానియా మీర్జాకు బ్రాండ్ అంబాసిడర్ నియామకపు పత్రాన్ని కూడా కెసిఆర్ అందజేశారు.

కాగా, భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రయోజనాలను సానియా ప్రమోట్‌ చేయనుంది. సానియా స్వస్థలం హైదరాబాద్‌ కావడం మనందరికి గర్వకారణమని కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రూ. కోటి నజరానాను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బహూకరించారు.

కెసిఆర్

కెసిఆర్

టెన్నిస్‌లో మరింత ప్రతిభా పాటవాలు ప్రదర్శిచేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరాన చెక్కును ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సానియాకు అందజేశారు.

కెసిఆర్

కెసిఆర్

నగరంలోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశం సందర్భంగా కెసిఆర్‌ ఈ చెక్కును అందజేశారు. సానియా మీర్జాకు బ్రాండ్ అంబాసిడర్ నియామకపు పత్రాన్ని కూడా కెసిఆర్ అందజేశారు.

కెసిఆర్

కెసిఆర్

సానియా మీర్జా తెలంగాణ బిడ్డ కావడం వల్లే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

టెన్నిస్ ప్రపంచంలో సానియా నెంబర్ వన్‌గా నిలవాలని ఆయన అభిలాషించారు.

కెసిఆర్

కెసిఆర్

అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

సానియా స్వస్థలం హైదరాబాద్‌ కావడం మనందరికి గర్వకారణమని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

English summary
As announced by him a day before, Telangana Chief Minister KCR has handed over a cheque of Rs. 1 crore to ace tennis player of Hyderabad Sania Mirza. KCR had said that he is proud of Sania Mirza as she belongs to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X