జగన్, చంద్రబాబుకు అందిన సర్వేల్లో ఏముంది- సంకేతాలు క్లియర్..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు పైకి గెలుపు పైన ధీమాగా ఉన్నా..లోలోపల మాత్రం డైలమాతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళి పైన పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నారు. నియోజకవర్గాల వారీగా నుంచి వచ్చిన నివేదికలతో పాటుగా సర్వే సంస్థల రిపోర్ట్స్ పైన కసరత్తు చేసారు. ఫలితంపైన జగన్,చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు. పార్టీ కేడర్ కు ఇద్దరు నేతలు ఫలితం పైన క్లారిటీ ఇస్తున్నారు.
ఫలితం పై అంచనాలు
ఏపీలో పోలింగ్ ముగిసి రెండు వారాలు అయింది. పోలింగ్ సరళి పైన అభ్యర్దుల నుంచి పార్టీల అధినేతల వరకు పూర్తి స్పష్టతతో ఉన్నారు. కొందరు గెలుపు పైన ధీమాతో ఉండగా..మరి కొందరు మాత్రం డైలమా లో కనిపిస్తున్నారు. ఇదే సమయంలో అటు వైసీపీ...ఇటు కూటమి కోసం పలు సర్వే సంస్థలు పని చేసాయి. ఓటింగ్ జరిగిన రోజు ఓటరు నాడి పసి గట్టే ప్రయత్నం చేసాయి. తమ సర్వేల్లో తేలిన లెక్కలను సంస్థ లు సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించారు. జగన్ పోలింగ్ పూర్తయిన వెంటనే రెండు రోజుల పాటు పూర్తిగా ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందనే అంశం పైన కసరత్తు చేసారు. మూడు సంస్థల ముఖ్యులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

సుదీర్ఘ కసరత్తు
పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాల వారీగా సామాజిక లెక్కలు, పథకాల లబ్దిదారులు, వైసీపీ అనుకూల - ప్రతికూల ఓటింగ్ పైన చర్చించారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఐ ప్యాక్ టీంతో సమావేశం సమయంలో తాము 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా గెలుస్తామని..దేశం మొత్తం జూన్ 4న తమ వైపు చూస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీలోనూ జగన్ చెప్పింది సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. అయితే, ఆ తరువాత విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ మరింత లోతుగా అధ్యయనం చేసిన తనకు కొన్ని సమీకరణాల ఆధారంగా నివేదికలు ఇవ్వాలని మూడు సర్వే సంస్థలను కోరారు.
గెలుపు దక్కేదెవరికి
ఆ సంస్థల నుంచి నివేదికలు జగన్ కు తాజాగా చేరాయి. దీంతో..తిరిగి అధికారంలోకి వస్తున్నామని విదేశీ పర్యటనలో ఉన్న జగన్ తో టచ్ లోకి వెళ్లిన పార్టీ ముఖ్య నేతలు ఇద్దరికి జగన్ స్పష్టం చేసారు. జగన్ ఇప్పటికీ తాను చెప్పిన మాట పైనే నిలబడి ఉన్నారని ఆ నేతలు చెబుతున్నారు. ఇటు చంద్రబాబు క్యాంపు నుంచి ఫలితం పైన స్పందన రాలేదు. చంద్రబాబు మూడు సర్వే సంస్థలతో పాటుగా గతంలో కాంగ్రెస్ కోసం పని చేసిన మరో వ్యూహకర్త సంస్థ నుంచి సర్వే నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. అందులో ఏపీ ఫలితం పైన క్లారిటీ వచ్చింది. దీంతో..పార్టీ వర్గాలకు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇద్దరు నేతలు గెలుపు పైన ధీమాగా ఉండటంతో..విజయం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications