బోణి కొట్టాలని బాబు, హ్యాట్రిక్ కొట్టాలని జగన్, ప్రజలు దేనికి జై కొడతారో చూడాలి!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం విభిన్న వాతావరణం వుంటుంది. తమిళనాడు సరిహద్దుకు అత్యంత చేరువలో వుండే ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కల్చర్ వుంటుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దు కావడంతో వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
పూతలపట్టు నియోజక వర్గం పరిధిలో పూతలపట్టు, ఐరాల, తవనంపల్లె, బంగారుపాలెం, యాదమర్రి నియోజకవర్గాలున్నాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచింది. పుత్తూరులో గాలి ముద్దుకృష్ణమ నాయుడు తరువాత నగరిలో కూడా ఆరో విజయం అందుకున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దు కావటంతో వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2, 20,136 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్‌కు జగన్ టికెట్ కేటాయించారు.
ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,136 మంది. వీరిలో పురుషులు 1,09,424 మంది.. మహిళలు 1,11,606 మంది. పూతలపట్టు నియోజక వర్గంలోని ఐదు మండలాలు ఉన్నాయి. ఇక ఐరాల మండలంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వెలసిన కాణిపాకం ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. యాదవ, గాండ్ల, మొదలియార్, గౌండర్, ఎస్సీ, యాదవ సామాజికవర్గాలు పూతలపట్టులో బలంగా వున్నాయి.
2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. 2014లో వైసీపీ అభ్యర్ధి ఎం సునీల్ కుమార్, 2019లో అదే పార్టీకి చెందిన ఎంఎస్ బాబులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు 1,03,265 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి ఎల్ లలిత కుమారికి 74,102 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 29,163 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి పూతలపట్టులో విజయం సాధించింది.

2024 ఎన్నికల్లో పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్‌కు జగన్ టికెట్ కేటాయించారు. ఎంఎస్ బాబు ఆధిపత్య ధోరణి కేడర్‌కు నచ్చకపోవడంతో సీఎం జగన్ ఆయనకు నో చెప్పారు సీఎం. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ జెండా ఇక్కడ ఎగరలేదు.
ఈసారి ఎలాగైనా పూతలపట్టులో గెలవాలని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో కేడర్‌ను కలుపుకుని ముందుకు పోవడంతో పాటు దళితవాడల్లో పల్లె నిద్ర వంటి కార్యక్రమాలను మురళీమోహన్ చేపట్టారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమకు కలిసొస్తుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications