Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వై నాట్ 175, ఇదీ కార్యాచరణ : చంద్రబాబు అరెస్ట్ పై జగన్ సంచలనం...!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. పార్టీ శ్రేణులకు ఎన్నికల వరకు కార్యాచరణ ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పైన ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని..పవన్ ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నానని చెబుతున్నారని గుర్తు చేసారు. చంద్రబాబు అరెస్ట్ లో కక్ష లేదన్నారు. మార్చి వరకు పార్టీ కేడర్ కు జగన్ కార్యాచరణ ప్రకటించారు. ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి వెల్లడించారు.

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కక్ష్య లేదన్నారు. తాను దేశంలోనే లేని సమయంలో అరెస్ట్ జరిగిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. దత్తపుత్రుడు ఇప్పటికీ బీజేపీతో ఉన్నానని చెబుతున్నారని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటుగా సగం బీజేపీ సగం చంద్రబాబుతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.

CM YS Jagan fixed Road map for next Election, announces four key programmes for party cadre

చంద్రబాబు పై మోదీ అవినీతి ఆరోపణలు చేసే నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేసారు. అప్పుడే సీబీఐ రాష్ట్రంలోకి ప్రవేశానికి వ్యతిరేకించిందని..నాడు విచారణ జరగకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర సంస్థలు ఈడీ, ఐటీ ఈ కేసులో విచారణ చేసాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు బయట ఉన్నా..జైల్లో ఉన్నా ఒక్కటేనని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును సమర్ధిస్తే పేదలను వ్యతిరేకించినట్లేనని ముఖ్యమంత్రి విశ్లేషించారు.

CM YS Jagan fixed Road map for next Election, announces four key programmes for party cadre

పొత్తులతో వాళ్లకు వచ్చేది సున్నా
టీడీపీ, జనసేన ప్రతిపక్షాలు ఒక్కటైనా పెద్ద సున్నానే అని సీఎం చెప్పుకొచ్చారు. అధికారంలోకి రావటం కోసం అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పొత్తులను నమ్ముకోలేదని దేవుడిని...ప్రజలను నమ్ముకున్నానని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల వరకు ముఖ్యమంత్రి వరుసగా నెలల వారీగా క్యాలెండర్ విడుదల చేసారు. ఇప్పటి వరకు 2.35 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ది చేసామని ముఖ్యమంత్రి వివరించారు.

ఇప్పటికే ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్షను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నవంబర్ 10 వరకు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం అందించటమే లక్ష్యమని వివరించారు. వై ఏపీ నీడ్స్ జగన్ షెడ్యూల్ ను సీఎం ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు రెండు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.ప్రతీ సచివాలయంలో అభివృద్ధి, సంక్షేమ వివరాలను బోర్డులను ఆవిష్కరించాలి. మండల స్థాయిలో స్థానిక పెద్దలతో మమేకం అవ్వాలి. వారి ఆశీర్వాదం తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

ఎన్నికల కార్యాచరణ ఖరారు
ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ నియోకవర్గంలో బస్సు యాత్రలకు నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. 60 రోజుల పాటు ప్రతీ రోజు మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్స్ నిర్వహించాలని సూచించారు. పేదలంతా ఏకం కావాలి... పెత్తందార్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా సంబరం నిర్వహిణకు నిర్ణయించారు.

CM YS Jagan fixed Road map for next Election, announces four key programmes for party cadre

జవనరి 1న వృద్ధుల పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ 2,750 నుంచి మూడు వేలకు పెంచుతూ అమల చేస్తామని.. పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతందన్నారు. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత,జనవరి 20-30 వరకు వైఎస్సార్ ఆసరా చివరి విడత నిధుల కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో మరోసారి జగన్ నే తెచ్చుకుందాం..ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+