వైసీపీ తుది జాబితా, చివరి నిమిషంలో మార్పులు - లిస్టులో ఉన్నదెవరు..!!
ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. సీఎం జగన్ తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితా మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్దుల మార్పు ద్వారా ఎవరు పోటీలో ఉంటారనేది దాదాపు క్లారిటీ ఇచ్చారు. చివరి నిమిషంలో స్వల్ప మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తరహాలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను జగన్ ప్రకటించనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
వైసీపీ జాబితా : వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితా కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎం జగన్ తన తండ్రి సమాధి సాక్షిగా ఇడుపుల పాయలో జాబితా విడుదల చేయనున్నారు. కొన్ని మార్పులు చేర్పులు మినహా ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్దులనే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కడప జిల్లాల్లో అభ్యర్దుల మార్పు విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. తొలుత కొన్ని మార్పులు అవసరమని చర్చ జరిగినా..మారుతున్న లెక్కలతో తిరిగి ఎంపీగా అవినాశ్ రెడ్డిని ఎంపీగా, తిరిగి పది నియోజకవర్గాల్లోనూ ప్రస్తుత అభ్యర్దులనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఎంపీల పైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి, విజయనగరం, బాపట్ల ఎంపీ అభ్యర్దుల పైన ఈ జాబితాలో ప్రకటన చేయనున్నారు.

మార్పులు ఉంటాయా : గుంటూరు ఎంపీ అభ్యర్ది మార్పు పైన ప్రచారం సాగుతోంది. మైనార్టీ మహిళకు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారిక జాబితాలో స్పష్టత రానుంది. ఎంపీ అభ్యర్దుల జాబితా నందిగం సురేష్ ప్రకటించ నున్నారు. గోదావరి జిల్లాల్లో తాజాగా చేరికలు జరగటంతో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మహిళలకు ప్రాదాన్యత ఇచ్చారు. ఇక..తాడేపల్లి గూడెం నుంచి ఈలి నాని పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని స్థానంలో ఆయన కుమారుడు పేరు రేసులో ఉంది. జగన్ నిర్ణయం ఏంటనేది జాబితాలోనే తెలిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు జిల్లాలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఎన్నికల ప్రచారం : ఈ జాబితా విడుదల చేసిన తరువాత ఈ నెల 18న జగన్ తన పార్టీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. 19వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రతీ సభలోనూ తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల గురించి వివరించనున్నారు. ఇక, కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ప్రచారం రేపు (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఈ మధ్నాహ్నం ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇక..వైసీపీ జాబితా పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications