రెండు రోజుల్లో లెక్క మార్చేసిన జగన్...!!

ఏపీ ఎన్నికల్లో అసలైన సమరం మొదలైంది. లెక్కలు తేల్చే సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలబడుతున్నాయి. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ లెక్క వేరుగా ఉంది. విజయం అక్కడే డిసైడ్ కానుంది. పోల్ మేనేజ్ మెంట్ లో ఎవరిది పై చేయి. మొత్తంగా ఈ 48 గంటలే పోలింగ్ సీన్ మార్చేస్తుందా. చివరి నిమిషంలో ఎన్నికలవేళ ఏపీలో ఏం జరుగుతుంది.

హోరా హోరీ పోరు
ఏపీలో ఎన్నికల సమరంలో అసలైన యుద్ధం ఆరంభమైంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ఘట్టం ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే అటు జగన్, ఇటు చంద్రబాబు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల బలమైన నియోజకవర్గాల పైన గురిపెట్టారు. ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా కేడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ కు ముందు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తొలి నుంచి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేల మార్పు దగ్గర నుంచి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేశారు.

CM YS Jagan Maily foucs on rayalaseem Distrcits to get majority seats in the Elections will he succed

మారుతున్న లెక్కలు
ఇప్పుడు ఎన్నికల్లో పూర్తిగా సామాజిక కోణంలోనే యుద్ధం జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా జగన్ రాయలసీమలో పట్టు నిరూపించుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన జగన్ రాయలసీమలో కీలక మార్పులు చేశారు. 52 నియోజకవర్గాల్లో 2019లో టిడిపిని కేవలం మూడు సీట్లకే పరిమితం చేసిన జగన్.. ఈసారి ఎన్నికల్లోను అదే పట్టు కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టిడిపి సైతం తమ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. రెండు జిల్లాల్లో రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ఎన్నికల యుద్ధం సాగుతున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. జగన్ రాయలసీమ జిల్లాల్లో ఈ సారి కొత్త వ్యూహంతో అడుగులు వేశారు.

CM YS Jagan Maily foucs on rayalaseem Distrcits to get majority seats in the Elections will he succed

కలిసొచ్చేదెవరికి
సీనియర్ నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ సీమ జిల్లాలో కీలకంగా మారుతుంది. దీంతో ప్రత్యర్థి పార్టీల బలహీనతలను తనకు అవకాశం గా మల్చుకుంటున్నారు. రాయలసీమలోని 52 స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవడం ద్వారా అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కావాలనేది జగన్ లక్ష్యం. అందులో భాగంగానే చివరి రెండు రోజుల్లో తన వ్యూహం మార్చారు. పార్టీ ముఖ్యులకు కీలక దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమాచారంతో అవసరమైన సూచనలు అందించారు. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ కీలకంగా మారుతుంది. స్పష్టమైన లక్ష్యాన్ని జగన్ నిర్దేశించారు. ఆ లక్ష్యం వైసిపి నేతలు చేరుకుంటే విజయం సులభం అవుతుందనేది అంచనా. దీంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లో పోలింగ్.. వైసిపి గెలిచే సీట్ల సంఖ్య పైన ఆసక్తి కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+