ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ, బీజేపీ మార్క్ రాజకీయం - కీలక మలుపు..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ కేంద్రం లెక్కలు మారుతున్నాయి. ఏపీలో ఎన్నికల పొత్తుల్లో తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. టీడీపీ తిరిగి ఎన్డీఏలోకి ఎంట్రీ ఖాయమని భావిస్తున్న వేళ సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఈ రోజు ప్రధానితో సమావేశమయ్యారు. సుదీర్ఘ భేటీలో ఏపీకి చెందిన పాలనా అంశాలతో పాటు రాజకీయ అంశాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఈ భేటీతో కేంద్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు:ఏపీలో టీడీపీ తిరిగి బీజేపీతో జత చేరేందుకు రంగం సిద్దమైంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి సీఎం జగన్ కు పిలుపు వచ్చింది. ఈ మధ్నాహ్నం ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నార పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల నిర్ణయం తీసుకోవాలని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలుస్తోంది. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులతో పాటుగా అడహక్ నిధుల విడుదల పైన మరోసారి సీఎం ప్రస్తావించగా.. వీటి విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

CM YS Jagan meets PM Modi Discussed various issues on Administration adn Political developments

కీలక నిర్ణయాలు:తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ పైనా సీఎం జగన్ ఈ భేటీలో ప్రధానిని కోరినట్లు సమాచారం. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తరువాత జగన్ కు పిలుపు రావటం ద్వారా బీజేపీ నేతల రాజకీయం అంతుచిక్కటం లేదు. రెండు పార్టీలకు సమ దూరం ఉంటామనే సంకేతాలు ఇచ్చేందుకు ఈ భేటీకి ఆహ్వానించినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

ఏం జరగనుంది:జగన్ కు పాలనా పరంగా వెసులుబాటు కలిగించే నిర్ణయాలను కేంద్రం వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ముందుగా అరగంట సమయం ఈ ఇద్దరి భేటీకి ఖరారు చేసారు. అయితే, గంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిటంత ఈ భేటీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశమయ్యారు. ఏపీకి ఆర్దికంగా దక్కాల్సిన ప్రయోజనాల పైన చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ భేటీ ప్రభావం టీడీపీ తిరిగి ఎన్డీఏ లో చేరే అంశం పైన ఉంటుందా.. పొత్తు ఖాయం అవుతుందా.. లేక బీజేపీ నాయకత్వ ఆలోచనల్లో మార్పు వచ్చిందా అనేది ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పాటుగా జనసేనలో ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+