దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ..!!
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని మూలా నక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి జగన్ దర్శించుకొని, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్‌అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం దుర్గగుడి అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం దుర్గగుడి నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు.

శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మ దర్శనం కోసం దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ మూడు రోజులు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications