మహిళా ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్!!

మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ విషయంలో ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేదోడుగా నిలుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏపీ మహిళా ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు.

ఇప్పటి వరకు ఈ చైల్డ్ కేర్ లీవ్ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉండగా, ఆ నిబంధనను సవరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సీఎం జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

CM YS Jagan said good news to women employees on child care leave

మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను ఒక్క మాటతో పరిష్కరించారు. మహిళా ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా తమకు ప్రభుత్వం కేటాయించిన చైల్డ్ కేర్ లీవ్ ను ఉపయోగించుకునేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్ రెన్యువల్ విషయంలోనూ ఎమ్మెల్సీల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ మూడు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు, ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అండగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారంటూ ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి ని కొనియాడుతున్నారు.

CM YS Jagan said good news to women employees on child care leave
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+