ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఉంటుందా: పీఆర్సీపై వైఎస్ జగన్ కీలక భేటీ
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ వివాదం నడుస్తోంది. సీసీఎస్ రద్దు, పీఆర్సీ అంశాలు కొలిక్కి రావట్లేదు. ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పటిదాకా నిర్వహించిన చర్చలేవీ ఫలప్రదం కాలేదు. వాటిల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన యధాతథంగా కొనసాగుతూ వస్తోంది. ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. జనవరి 3వ తేదీ నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. మళ్లీ ఉద్యమిస్తామంటూ జేఏసీ నాయకులు ఇదివరకే అల్టిమేటం ఇచ్చారు.

3 గంటలకు సమీక్ష
ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఈ విషయంలో జోక్యం చేసుకోనున్నారు. ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశాన్ని షెడ్యూల్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు ఇందులో పాల్గొంటారు.

పీఆర్సీలో సవరణలు.. ?
ఈ భేటీలో తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు దఫాలుగా పీఆర్సీ అంశాన్ని తేల్చేయడానికి సమీక్ష సమావేశాలు ఏర్పాటయ్యాయి. అవేవీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు గానీ.. ఈ సమావేశాల ద్వారా స్వీకరించిన అభిప్రాయాలతో మరో తాజా నివేదికను రూపొందించారు. పీఆర్సీలో సవరణలు చేస్తే- ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఎంత ఉంటుంది? ఏ స్థాయి ఉద్యోగులకు ఎంత మొత్తంలో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంటుందనే విషయాలను ఈ నివేదికలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పొందుపరిచినట్లు చెబుతున్నారు.

తాజా నివేదికపై..
ఇదే నివేదికతో పాటు ఇప్పటిదాకా పీఆర్సీ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఈ మధ్యాహ్నం నిర్వహించే సమీక్ష సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారి డిమాండ్లన్నింటనీ ఈ నివేదికలో చేర్చారు. ఇదే చివరి భేటీ కావొచ్చని, ముఖ్యమంత్రి పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకుంటారనే అంచనాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఈ రాత్రి నాటికి తుది ప్రకటన వెలువడొచ్చనీ అంటున్నారు.

జనవరి 3 నుంచి
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఏదీ రాకపోతే జనవరి 3వ తేదీ నుంచి తాము మళ్లీ ఆందోళనలు చేపడతామంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఇదివరకే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు కిందిటవారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్‌లో సమావేశం అయ్యారు. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. తదుపరి సమీక్ష సమావేశంలో పీఆర్సీపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే ఉద్యమం తప్పదనీ హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లపై..
పీఆర్సీ, బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేసి తీరాల్సిందేనంటూ పట్టుబట్టారు. జనవరి 3వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అప్పటిలోగా సానుకూల నిర్ణయాన్ని, తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం తుది ప్రకటన చేస్తుందని ఆశిస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి వైఖరి వచ్చినా.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని స్పష్టం చేస్తోన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications