ఈ నెల 20వ తేదీన ఏపీలో.. !!
YS Jagan: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఏపీ సహా..
లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

నాలుగో విడతలో..
లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.
మేనిఫెస్టోపై..
ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి సారించారు. దీనికి తుది రూపాన్ని ఇవ్వబోతోన్నారు. ఇప్పటికే మేనిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయింది కూడా. దీనిపై వైఎస్ జగన్ ఆమోదం తెలపాల్సి ఉంది. డ్రాఫ్టింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని, సోమ, మంగళవారాల్లో ఈ పనులు పూర్తవుతాయని అంటున్నారు.
నవరత్నాలకు మించి..
ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉండొచ్చని సమాచారం. నవరత్నాల తరహాలోనే సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలనూ ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.
మహిళలు, రైతులపై వరాలు..
మహిళలు, రైతుల, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. రైతులకు రుణమాఫీని జగన్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణాలను కొనసాగించడం, యువతకు ఉద్యోగాల కల్పనపై కొన్ని స్పష్టమైన హామీలు ఉంటాయని సమాచారం.












Click it and Unblock the Notifications