ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..!
దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం అయిన ఏపీకి ఇప్పుడు దాన్ని రక్షించుకోవడమే కీలకంగా మారింది. ముఖ్యంగా పొరుగున ఉన్న తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించిన బోట్లు ఇప్పుడు ఏపీ జలాల్లోకి ప్రవేశించి రచ్చ చేస్తున్నాయి. వీటి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు (chandrababu) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ తీరంలోకి వచ్చి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు చేస్తున్న ఆగడాలు, అక్రమ వేట నిరోధానికి సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మెరైన్ ఐజీ గోపీనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇతర రాష్టాల బోట్ల చొరబాట్ల నేపథ్యంలో తీరంలో 24గంటలూ గస్తీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 4 బోట్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు గస్తీలో ఉన్నాయని తెలిపారు. త్వరలో మరో 4 బోట్లు కూడా ఈ గస్తీలో చేరతాయన్నారు. ఈ మధ్య మూడు ఇతర రాష్ట్రాల బోట్లని టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నట్లు గోపీనాథ్ వెల్లడించారు.

ఏపీ తీరంలో ఇతర రాష్ట్రాల బోట్ల హంగామాపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బంగాళాఖాతంలోకి ఈ అక్రమ బోట్లు చొరబడి చేపల వేట సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు మంత్రి తెలిపారు. ఈ బోట్ల సాయంతో మన మత్స్య సంపదను తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులు కొల్లగొడుతున్నారని ఆయన తెలిపారు. అందుకే అత్యాధునిక స్పీడ్ బోట్ల సాయంత టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందన్నారు.












Click it and Unblock the Notifications